Site icon NTV Telugu

Old Temples Lift: జాకీల సాయంతో వందేళ్ల నాటి ఆలయాలు లిఫ్ట్.. ఎక్కడో తెలుసా?

Old Temples Lift Tamil Nadu

Old Temples Lift Tamil Nadu

జాకీల సాయంతో ఇళ్లను లిఫ్ట్ చేసి.. ఎత్తు పెంచడం మనందరికీ తెలిసిందే. మొదటిసారిగా ఆలయాలను కూడా లిఫ్ట్ చేస్తున్నారు. తమిళనాడులో ఎప్పుడో కట్టిన ఆలయాలు కావడంతో.. వాటి చుట్టూ రోడ్ల ఎత్తు పెరిగి సమస్యలు ఎదురవుతున్నాయి. గుడులు రోడ్డకు దిగువన ఉండడంతో వర్షాకాలంలో ముంపు సమస్య ఎదురవుతోంది. ఈ సమస్య నుంచి బయటపడడాని పలు ఆలయ కమిటీలు లిఫ్ట్ చేసే పద్దతిని అనుసరిస్తున్నాయి.

హిందూ రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ అనుమతితో ఇప్పటికే 15 ఆలయాల ఎత్తు పెంచాయి. ఈ పనులను మామచంద్ హౌస్ లిఫ్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేపడుతోంది. చెన్నైలోని పురాతన ఆలయాల్లో మధ్య కైలాష్ ఆనంద వినాయకర్ గుడి ఒకటి. సర్దార్పటేల్ రోడ్డు, ఓల్డ్మహాబలిపురం రోడ్ల మలుపులో ఉన్న ఈ ఆలయం ముంపులో ఉంది. రహదారితో పోల్చితే లోపలున్న ప్రధాన, ఉప ఆలయాలు ఆరు అడుగుల కింద ఉన్నాయి. దాంతో వర్షం పడితే పెద్దఎత్తున వరద వచ్చి చేరుతోంది. పూజా కార్యక్రమాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. దీంతో ఆలయాల ఎత్తును ఆరు అడుగుల మేర పెంచుతున్నారు.

Also Read: Wiaan Mulder: బ్రియాన్ లారా వరల్డ్ రికార్డ్ సేఫ్.. బ్రేక్ అయ్యేదే కానీ వద్దనుకున్నాడు!

కొద్ది నెలలుగా 12 ఆలయాల ఎత్తును ఆరు అడుగుల మేర పెంచే పనులు జరుగుతున్నాయి. అంబళ్, వీరాంజనేయ, నవగ్రహ, శివుని ఆలయాల పనులు పూర్తవగా.. ప్రధాన రాజగోపురం, వినాయక ఆలయాన్ని అడుగు మేర ఎత్తారు. మొత్తంగా 25 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం చెన్నై వ్యాసర్పా డిలోని రవీశ్వరార్, పన్రుట్టిలోని సోమేశ్వరర్, కోవిలంబాక్కం బాలగురునాథస్వామి ఆలయాల పనులు కొనసాగుతున్నాయి. పునాదుల మీద జాకీల్ని అమర్చి, ఆలయాల్ని ఒక్కో అడుగు చొప్పున పైకి ఎత్తుతూ నిర్మాణాలు చేపడుతున్నారు. చెంగల్పట్టు సింగపెరుమాల్ కోయిల్లో 1500 ఏళ్ల క్రితం పల్లవరా జులు నిర్మించిన ఆంజనేయస్వామి ఆలయాన్ని 6 అడుగుల మేర పైకి లేపారు. పునాది పైన, గోడ మధ్యలో బెల్ట్ తరహాలో పటుత్వం వచ్చేలా రెండంచెల బెల్ట్బమ్ కాంక్రీట్ సాంకేతికతను వాడుతున్నారు. దీంతో గోడ దృఢంగా ఉండటంతో పాటు భవిష్యత్తులో వర్షాలకు నీరు లోపలికి చేరదు.

Exit mobile version