Viral : మనం అనుకోకుండానే కొన్ని సార్లు ఊహించని ప్రమాదాలు ఎదురవుతుంటాయి. వాటిలో ప్రాణాలు సైతం పోగొట్టుకున్న సందర్భాలు అనేకం. ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న బస్సు నుంచి యువతి జారిపోయి రోడ్డు మీద పడి చనిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సేలం జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు ప్రయాణికులతో రద్దీగా ఉంది. బస్సులో ఖాళీ లేకపోవడంతో ఓ యువతి బస్సు డోర్ దగ్గర ఫుట్ బోర్డుపై నిలుచుంది. బస్సు డ్రైవర్ అతివేగంగా టర్న్ తీసుకోవడంతో డోర్ దగ్గర ఫుట్ బోర్డుపై ఉన్న యువతి పట్టు కోల్పోయింది. ఒక్కసారిగా అమాంతం బస్సులోంచి జారి రోడ్డుపై పడింది. బస్సులోంచి చాలా దూరంగా వెళ్లి పడింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
Read Also:Bus Accident: అదుపుతప్పి నదిలో పడిన ప్రైవేట్ బస్సు.. 24 మంది మృతి
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు యువతి దగ్గరికి పరుగులు తీశారు. యువతిని కాపాడాలని చాలా ప్రయత్నించారు. కానీ, అప్పటికే ఘోరం జరిగిపోయింది. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ యాక్సిడెంట్ చాలా షాకింగ్ గా ఉంది. యువతి నిర్లక్ష్యం, బస్సు డ్రైవర్ అతివేగం.. ఓ నిండు ప్రాణం పోవడానికి కారణమయ్యాయి. మృతురాలిని కౌసల్యగా(20) పోలీసులు గుర్తించారు. నమ్మక్కల్ జిల్లా రసిపురంలో నివాసం ఉంటుంది. అట్టియంపట్టిలో గార్మెంట్ కంపెనీలో ఆమె పని చేస్తుంది. బుధవారం సాయంత్రం డ్యూటీ అయిపోయాక ఇంటికి వెళ్లేందుకు కౌసల్య 6గంటల సమయంలో ప్రైవేట్ బస్సు ఎక్కింది. అయితే, అప్పటికే బస్సులో చాలా రద్దీగా ఉంది. లోపలికి వెళ్లే అవకాశం కూడా లేదు. చీకటిపడిపోతే ఇబ్బంది అవుతుందని భావించిన కౌసల్య.. మరోదారి లేక.. ఆ బస్సే ఎక్కింది. ఫుట్ బోర్డుపైనే నిల్చుంది. చంద్రా థియేటర్ దగ్గర మలుపు వచ్చింది. బస్సు వేగంగా పోవడంతో.. కౌసల్య పట్టు కోల్పోయింది. ఫుట్ బోర్డు నుంచి జారి రోడ్డుపై పడి ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also:Lotus Pond Hyderabad: చేపలు చస్తున్నాయ్.. వాసనకు ముక్కులు పోతున్నాయ్
#சேலம் அருகே தனியார் பேருந்தில் பயணித்த இளம்பெண்,சாலை வளைவில் வேகமாக பேருந்து திரும்பும்போது தவறி கீழே விழுந்து உயிரிழப்பு..
இளம்பெண் பேருந்தில் இருந்து தவறி விழும் சிசிடிவி காட்சி#BusAccident pic.twitter.com/QBxR94fnWG
— RAMJI (@RAMJIupdates) May 4, 2023
