Site icon NTV Telugu

Tamilnadu: తమిళనాడులో ఘోర ప్రమాదం.. బిల్డింగ్ కూలి ఆరుగురి మృతి

Tn Accident 6 Die

Tn Accident 6 Die

తమిళనాడులో (Tamilnadu) ఘోర ప్రమాదం జరిగింది. ఊటీలో బిల్డింగ్ కూలి ఆరుగురు కూలీలు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఊటీలోని జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టారు. శిథిలాల క్రింద ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని వెతుకుతున్నారు. ప్రస్తుతానికి ఆరుగురు చనిపోయారని అధికారులు తెలిపారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉందని చెప్పుకొచ్చారు. మృతులు సకీల (30), సంగీత (35), భాగ్య (36), ఉమ (35), ముత్తులక్ష్మి (36), రాధ (38)గా గుర్తించారు.

Exit mobile version