NTV Telugu Site icon

Rajinikanth: ఉప రాష్ట్రపతి పదవిపై రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు

Venka 1

Venka 1

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా ఉప రాష్ట్రపతి పదవిపై ఆయన చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ముప్పవరపు వెంకయ్య నాయుడు గతంలో వివిధ పదవులు అధిరోహించారు. అనంతరం ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి పదవీ విరమణ చేశారు. వెంకయ్యనాయుడికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం నాకు నచ్చలేదు. గొప్పనాయకుడిని రాజకీయాల నుంచి దూరం చేశారన్నారు రజనీకాంత్. ఉపరాష్ట్రపతి హోదాలో ఎలాంటి అధికారాలు ఉండవు. చాలా విషయాల్లో ప్రోటోకాల్ కండిషన్స్ ఉంటాయని అభిప్రాయపడ్డారు రజనీకాంత్.

Read Also: Teachers Mlc Election: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం, బరిలో 21 మంది

నేను ఉపరాష్ట్రపతి పదవిని కించపరచడం లేదు .. వెంకయ్యనాయుడు మరికొన్ని రోజులపాటు కేంద్రమంత్రిగా కొనసాగివుంటే బాగుండేదన్నారు. చిన్న మచ్చకూడా లేకుండా ఉన్న వ్యక్తి వెంకయ్యనాయుడు అన్నారు రజనీకాంత్. గతంలోనూ అనేక మార్లు ఉప రాష్ట్రపతి పదవి విషయంలో వెంకయ్యనాయుడు తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రాజకీయాల్లో అనేకమంది కూడా ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి వెంకయ్యనాయుడిని రాజకీయాలకు దూరం చేశారని అభిప్రాయపడ్డారు. తాజాగా రజనీకాంత్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రజనీకాంత్ వ్యాఖ్యలపై ఎలాంటి కామెంట్లు వస్తాయో చూడాలి మరి.

Read Also: Tragedy: వీడు నిజంగా భార్యా బాధితుడే.. అందుకే 13నెలలు జైల్లో ఉన్నాడు