NTV Telugu Site icon

Uma Ramanan Dies: ప్రముఖ గాయని ఉమా రామనన్ కన్నుమూత!

Uma Ramanan Dead

Uma Ramanan Dead

Tamil Singer Uma Ramanan Passed Away: ప్రముఖ తమిళ గాయని ఉమా రామనన్ కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో బుధవారం (మే 1) ఆమె తుదిశ్వాస విడిచారు. ఉమా వయసు 72. గాయని ఉమా మరణానికి అనారోగ్యమే కారణం అని తెలుస్తోంది. తమిళ చిత్రసీమలో ఎన్నో చిరస్మరణీయమైన పాటలు పాడిన ఉమాకు భర్త ఏవీ రమణన్, కుమారుడు విఘ్నేష్ రమణన్ ఉన్నారు. ఉమా రామనన్ అంత్యక్రియలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

శాస్త్రీయ సంగీత కళాకారిణి అయిన ఉమా రామనన్.. 35 ఏళ్లలో 6 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సహా విద్యాసాగర్, మణిశర్మ, దేవా తదితరుల వద్ద పనిచేశారు. మహానది, ఒరు కైథియన్ డైరీ, అరంగేట్ర వేళై మొదలైన ఎన్నో చిత్రాలకు ఆమె తన గాత్రం అందించారు. తెలుగులో చివరగా ‘ఓ చిన్నదాన’లో ‘దిమిమ్తో..’ అనే పాటను ఆలపించారు. విజయ్ చిత్రం ‘తిరుపాచి’లో మణిశర్మ స్వరపరిచిన ‘కన్నుమ్ కన్నుమ్తాన్ కలంతచు’ పాటే చివరిది.

Also Read: Anil Ravipudi-IPL: ఐపీఎల్ మ్యాచ్‌లపై కామెంట్స్.. డైరెక్టర్ అనిల్ రావిపూడిని ఆడుకుంటున్న ఫాన్స్!

ఉమా రామనన్ భర్త ఏవీ రమణన్ సంగీత విద్వాంసుడు. ఆయతో కలిసి ఎన్నో పాటలు పాడినా.. ఇళయరాజాతో కలిసి పాడిన పాటలే ఆమెకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి. ‘షాడోస్’ సినిమాలోని ఇళయరాజా స్వరపరిచిన ‘పూంకతావే తల్తీరావై…’ పాట సంగీత ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకుంది. ‘పన్నీర్ పుష్పనం’ సినిమాలోని ‘అనంతరాగం సనేకుమ్ కాలం..’, ‘ఆహాయ వెన్నిలావే…’ మరియు ‘ఒరు నాదన్ అనేకి తోట’లోని ‘ఉన్నై నినాచెన్…’ లాంటి పాటలు ఆమెను నిలబెట్టాయి. ఇళయరాజాతో కలిసి ఆమె 100కు పైగా పాటలు పాడారు.

 

Show comments