ప్రైవేట్ ఆల్బమ్స్‌తో క్రేజ్ మాత్రమే కాదు వరుస ఆఫర్స్ కొల్లగొట్టి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్‌కు కాంపిటీషన్ అయ్యాడు యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్. ఫస్ట్ సినిమా బెంజ్ ఇంకా రిలీజ్ కానప్పటికీ.. రీసెంట్లీ వచ్చి మ్యూజికల్ హిట్‌గా నిలిచిన డ్యూడ్‌తో సాయి టాలెంట్ గుర్తించిన మేకర్స్.. వరుస ఆఫర్స్ కట్టబెడుతున్నారు. ప్రజెంట్ అతడి లైనప్‌లో ఒకటి కాదు రెండు కాదు.. సుమారు అరడజన్ చిత్రాలు అతడి లైనప్ లో ఉన్నాయి.
Also Read : Prabhas : దసరా బరిలో ప్రభాస్ ‘ఫౌజీ’.. షూటింగ్ పూర్తయ్యే వరకు ఇతర సినిమాలకు నో డేట్స్..
ఏఆర్ రెహమాన్ వదిలేసిన సూర్య సినిమా కరుప్పుతో సాయి అభ్యంకర్ దశ తిరిగింది. ఆ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పడు తమిళ్ లో సాయి వరుసగా క్రేజీ ఆఫర్స్ పట్టేశాడు. ఇక అల్లు అర్జున్- అట్లీ భారీ బడ్జెట్ సినిమాకు కూడా సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మరొక స్టార్ హీరో కార్తీ సినిమా మార్షల్‌కు కమిటయ్యాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ధనుష్ 55వ సినిమాకు సైన్ చేశాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అమరన్ ఫేం రాజ్ కుమార్ పెరియా స్వామి డైరెక్షన్ లో ఈ సినిమా రాబోతుంది. ఇలా ఒకటేమిటి కోలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు అన్నిటికీ కూడా సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఆఫర్స్ చూస్తుంటే.. త్వరలో స్టార్ కంపోజర్స్ దుకాణం సర్దుకోవాల్సిందే.
