NTV Telugu Site icon

Man loses tongue: జ్యోతిష్యుడి సలహా విని పాము కాటుతో నాలుకను కోల్పోయాడు.. ఎలాగంటే?

Snake Bite

Snake Bite

Man loses tongue: నిద్రలో కలలు రావడం చాలా సహజం. మనలో చాలామందికి ఎప్పుడూ ఏవేవో కలలు వస్తూనే ఉంటాయి. అయితే వాటిలో కొన్ని మంచి కలలు, కొన్ని పీడకలలు వస్తుంటాయి. కొందరు వాటిని పట్టించుకోరు, మరికొందరు వాటిని సీరియస్‌గా తీసుకుంటారు. అయితే తమిళనాడులోని ఓ వ్యక్తి తనకు వచ్చిన కలను చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. దీంతో అతని కల నిజమైంది. ఫలితంగా నాలుకను కోల్పోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ నెల 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లాలో కోపిచెట్టిపాళయంకు చెందిన 54 ఏళ్ల రాజాకు ఎప్పుడూ తన కలలోకి పాములు వస్తూ ఉండేవి. ఓ పాము తనని కాటేసినట్లు తరచుగా కల వస్తుండేది. దీనిని అతడు చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. దీంతో ఇటీవల ఓ జ్యోతిష్యుడిని కలిసి తన కల గురించి అతడికి చెప్పాడు. దీంతో వెంటనే జ్యోతిష్కుడు రాజాకి ఓ సలహా ఇచ్చాడు. అదేంటంటే.. ఓ పాముకి పూజ చేస్తే నువ్వు ఈ ప్రమాదం నుంచి బయటపడగలవు అని ఆ జోత్యిష్యుడు సలహా ఇచ్చాడు. పాము సంచరించే ఆలయానికి వెళ్లి ఆ పాము ముందు నాలుకను చూపించూ అంటూ ఆ జ్యోతిష్యుడు సలహా ఇచ్చాడు. పూజారి సలహా మేరకు పూజ తర్వాత తన నాలుకను పాముకు చూపించాడు రాజా. అయితే వెంటనే ఆ విషసర్పం రాజా నాలుకమీద కాటు వేసింది. . పాము విషయం ఎక్కడంతో రాజా కింద పడిపోయాడు.

Viral Video: ఎలుకను చంపిన వ్యక్తి అరెస్ట్.. శిక్ష ఏంటంటే

అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతడిని చూసిన ఆలయ పూజారి వెంటనే నాలుక కోసి ఈరోడ్ మణియన్ మెడికల్ సెంటర్‌కు తరలించి చికిత్స అందించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ఆ వ్యక్తి కూడా స్పృహతప్పి పడిపోయాడు. నాలుక తెగిపోయిన రాజాకు వైద్యులు చికిత్స అందించారని, పాము విషానికి విరుగుడు కూడా అందించారని మణియన్ మెడికల్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ సెంథిల్ కుమారన్ తెలిపారు. నోటి నుంచి భారీగా రక్తం కారుతున్న స్థితిలో నవంబర్ 18న రాజా ఆస్పతిలో చేరాడని డాక్టర్ సెంథిల్ కుమార్ వివరించారు. పాము విషం కారణంగా రాజా నాలుక టిష్యూస్ ఎఫెక్ట్ అయ్యాయి. బాధితుడి ప్రాణాలు కాపాడేందుకు అతడి నాలుకను తీసేయాల్పి వచ్చింది. నాలుకను తొలగించిన తర్వాత కూడా పేషెంట్ ప్రాణాలను కాపాడేందుకు నాలుగు రోజులు కష్టపడాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు.