Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో మద్యం విక్రయాలు, టాస్మాక్ (TASMAC) పాలసీపై తీవ్ర స్థాయి రాజకీయ దుమారం రేగుతోంది. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టాస్మాక్ మద్యం దుకాణాల్లో ప్రభుత్వం సరికొత్త డిజిటల్ విధానాన్ని అమలు చేయడానికి సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు అనుసరిస్తున్న మాన్యువల్ ఇండెంట్ పద్ధతికి స్వస్తి పలికి, ప్రత్యేక హ్యాండ్‌హెల్డ్ పరికరాల ద్వారానే నేరుగా దుకాణాల నుంచి స్టాక్ ఇండెంట్‌ను నమోదు చేసే ప్రక్రియకు విద్యాశాఖ, అబ్కారీ శాఖలు శ్రీకారం చుట్టాయి.
అయితే ఈ డిజిటలైజేషన్ తోపాటు రాష్ట్రంలో ఉన్న సుమారు 2,500 టాస్మాక్ దుకాణాలను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించే ఆలోచనలో ప్రభుత్వం ఉందనే ప్రచారం ఊపందుకోవడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. ఈ ప్రైవేటీకరణ ప్రతిపాదనలను పీఎంకే (PMK) అధినేత అన్బుమణి రామదాస్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వమే మద్యం అమ్మకాలు జరపడం సిగ్గుచేటని, దాన్ని సరిదిద్దడానికి ప్రైవేటీకరించడం అంటే ఇల్లు ఈగలొచ్చాయని తగలబెట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. టాస్మాక్ దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే విచ్చలవిడిగా అక్రమ అమ్మకాలు పెరిగి యువత, విద్యార్థులు మరింతగా మధ్యానికి బానిసలయ్యే ప్రమాదం ఉందన్నారు.
Also Read
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
టాస్మాక్ వ్యవస్థను ప్రైవేటీకరించడం సరికాదని, దానికి బదులుగా రాష్ట్రంలో దశలవారీగా మద్యం దుకాణాలను పూర్తిగా మూసివేసి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రతిపాదనలు, విపక్షాల డిమాండ్ల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం టాస్మాక్ నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!