Site icon NTV Telugu

Ditva Cyclone: తమిళనాడుకు దిత్వా తుఫాన్ ఏఫెక్ట్..

Cyclone Ditva

Cyclone Ditva

Ditva Cyclone: తమిళనాడుకు దిత్వా తుఫాను ఏఫెక్ట్ గట్టిగానే తాకింది. దిత్వా ఏఫెక్ట్ కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు తుఫాను కదులుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. తమిళనాడులో భారీ వర్షాల కారణంగా అనేక విమాన సర్వీసులు రద్దు కావడంతో పాటు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఇండిగో ప్రయాణికులకు సూచన చేయగా, తాజాగా ఎయిరిండియా కూడా విమాన సర్వీసుల ప్రభావంపై అడ్వైజరీ జారీ చేసింది.

READ ALSO: Off The Record: హిల్ట్ పాలసీపై ఎంపీలు రియాక్ట్ అవకపోవడానికి ప్రత్యేక కారణాలున్నాయా ?

రామేశ్వరంలో భారీ వర్షం, ఈదురు గాలులతో రెండో రోజు జనజీవనం స్తంభించింది. రామనాథపురం, నాగపట్నంలలో వర్షం ప్రభావం తీవ్రంగా ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో చెన్నైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రాంతాల్లో ఎస్టీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ సహా 28 విపత్తు ప్రతిస్పందన దళాలను రంగంలోకి దించింది. ఇప్పటికే తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో 6వేల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తుఫాను కారణంగా శ్రీలంక అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

57 కు పైగా విమాన సర్వీసులు రద్దు…
చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో రేపు 57 కు పైగా విమాన సర్వీసులు రద్దు చేసినట్లు చెన్నై ఎయిర్‌పోర్ట్ వెల్లడించింది. అలాగే చెన్నై – శ్రీలంక విమాన సర్వీలు కూడా రద్దు చేసినట్లు ప్రకటించింది. భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా చెన్నై సహా దక్షిణాది నగరాల నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఎయిర్‌ ఇండియా అడ్వైజరీలో పేర్కొంది. ఎయిర్‌పోర్టుకు బయలుదేరే ముందు విమాన సర్వీసు స్టేటస్‌ను చెక్‌ చేసుకోవాలని సూచించింది. అంతకుముందు ఇండిగో కూడా ఇదే విధమైన అలర్డ్‌ విడుదల చేసింది. చెన్నై, చెంగల్‌పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, అరియలూరు, కడలూరు, మైలాడుతురై, నాగపట్నం, పుదుక్కోట్టై, రామనాథపురం, రాణిపేట్, తంజావూరు, తిరువారూరు, తూత్తుకుడి, నెల్లై, తిరువళ్లు, కోయంబత్తూర్, కోయంబత్తూరు సహా ముప్పై జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తంజావూరు, తిరువారూర్‌,చెన్నై మైలాడుదురై, విల్లుపురం, కడలూరు, కళ్లకురుచ్చి, కన్యాకుమారి జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

READ ALSO: Operation Sindhoor: ఆపరేషన్ సింధూర్‌కు భయపడిన పాకిస్థాన్.. 72 ఉగ్ర స్థావరాలను తరలించిన దాయాది

Exit mobile version