NTV Telugu Site icon

AP Elections 2024: ఏపీలో తమిళ్ హీరోయిన్ ఎన్నికల ప్రచారం..

Namitha

Namitha

ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.. ఎన్నికల పోలింగ్ కు అతి కొద్దిరోజులు మాత్రమే ఉండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో స్పీడును పెంచారు.. ఇక కొందరు అభ్యర్థులు మాత్రం తమకోసం ప్రచారం చెయ్యాలంటు సినీ తారలను దించుతున్నారు.. తాజాగా హీరోయిన్ నమిత కూడా ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.. బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు వచ్చింది..

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ తరపున ఆమె ప్రచారం చేశారు.. ఆయన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఆయనకు మద్దతుగా నమిత ప్రచారం చేశారు.. ఆమెను చూసేందుకు జనాలు కూడా ఎగబడ్డారు.. నమిత తన భర్త వీరేంద్ర చౌదరితో కలిసి ఈ ప్రచారంలో పాల్గొన్నది.. ముందుగా స్థానికంగా ఉండే చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ధర్మవరం పట్టణంలో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్నారు..

ఈ సందర్బంగా నమిత మాట్లాడుతూ.. దేశం, రాష్ట్రం బాగుండాలంటే బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సత్యకుమార్ గెలిస్తే ధర్మవరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారని అన్నారు. సత్యకుమార్ కు పోటీగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బరిలో ఉన్నారు.. ఇక నమిత ఈ మధ్యనే బీజేపీలో చేరింది.. ఆమె తమిళనాడులో బిజెపి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించింది.. కానీ చివరి నిమిషంలో పార్టీలో చేరడం వల్ల ఆమెకు బిజెపి టికెట్ ఇవ్వలేకపోయింది.. అయితే అవకాశం ఉంటే ఏదైనా పార్టీ పదవి ఇస్తామని బీజేపీ పార్టీ అధ్యక్షులు హామీ ఇచ్చారు..