NTV Telugu Site icon

Actor Jeeva: తమిళ హీరో జీవాకు ప్రమాదం.. ఇప్పుడు ఎలా ఉందంటే..

Jeeva

Jeeva

తమిళ హీరో జీవా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి సేలం వెళ్తుండగా అడ్డు వచ్చిన బైక్ ని తప్పించడానికి ప్రయత్నించడంతో కారు ప్రమాదానికి గురై అక్కడున్న బారికేడ్ ని గుద్దింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జుంది. హీరో, అతని భార్య క్షేమంగా బయటపడినట్లు సమాచారం. కన్నియమూర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

READ MORE: Karnataka: స్కూటర్ రిపేర్ చేయలేదని ఓలా షోరూంను పెట్రోల్ పోసి తగలబెట్టిన యువకుడు..

తమిళ హీరో జీవా తెలుగులో రంగం సినిమాతో పరిచయమ్యాడు. తెలుగులో యాత్ర-2 సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందాడు. అంతేకాకుండా 1983 ప్రపంచకప్‌ నేపథ్యంలో తెరకెక్కించి మూవీలో కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో నటించాడు. ప్రస్తుతం కోలీవుడ్‌లో సినిమాలతో నిమగ్నమయ్యాడు.

READ MORE: Rahul Gandhi: రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూ మద్దతు..

పోలీసుల విచారణ:
ఇందులో జీవాకు స్వల్ప గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు అదృష్టవశాత్తూ క్షేమంగా బయటపడ్డారు. అనంతరం చిన్నసేలం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన కారును స్వాధీనం చేసుకున్నారు. అలాగే జీవా కుటుంబ సమేతంగా మరో కారులో సేలం వెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show comments