NTV Telugu Site icon

Actor Karunas: బ్యాగ్‌లో 40 బుల్లెట్లు.. పోలీసులకు పట్టుబడిన నటుడు!

Actor Karunas

Actor Karunas

Actor Karunas found 40 live bullets in Airport: తమిళ్ ప్రముఖ నటుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాస్ బ్యాగ్‌లో 40 బుల్లెట్లు లభ్యమయ్యాయి. ఆదివారం చెన్నై నుంచి తిరుచ్చి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లిన కరుణాస్‌ బ్యాగ్‌లో 40 బుల్లెట్లను ఎయిర్‌పోర్టు అధికారులు గుర్తించారు. కరుణాస్‌ను సోదాలు చేస్తుండగా ఒక్కసారిగా సైరన్ మోగడంతో వెంటనే అధికారులు అలర్ట్‌ అయ్యారు. బ్యాగ్‌లో ఉన్న 40 బుల్లెట్లను ఎయిర్‌పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వార్త తమిళ నాట పెను సంచలనంగా మారింది.

తిరుచ్చి వెళ్లాల్సిన కరుణాస్ ప్రయాణాన్ని ఎయిర్‌పోర్టు అధికారులు రద్దు చేసి విచారణ జరిపారు. బ్యాగులో అన్ని బుల్లెట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తన వద్ద లైసెన్స్ గన్ ఉందని చెప్పిన కరుణాస్.. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను చూపించారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉన్నందున తుపాకీని దిండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చానని, అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి రావడంతో బ్యాగులో ఉన్న బుల్లెట్ల బాక్సును గమనించలేదని కరుణాస్‌ తెలిపారు.

Also Read: Raveena Tandon Car Accident: రవీనా టాండన్‌ మద్యం సేవించలేదు.. తప్పుడు కేసు నమోదు చేశాం: ముంబై పోలీసులు

దిండిక్కల్ పోలీస్ స్టేషన్‌లో తుపాకీ అప్పగించినట్లు రుజువు చేసే పత్రాలను కూడా ఎయిర్‌పోర్టు అధికారులకు కరుణాస్‌ చూపించారు. భద్రతా అధికారులు దిండిక్కల్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించగా.. కరుణాస్ చెప్పింది నిజమేనని తేల్చారు. ఈ మాటలను రికార్డ్‌ చేసుకున్న ఎయిర్‌పోర్టు అధికారులు.. కరుణాస్‌ను తిరుచ్చి వెళ్లేందుకు అనుమతించారు.

Show comments