NTV Telugu Site icon

Tamannaah : ఎయిర్ పోర్ట్ లో తళుక్కున మెరిసిన తమన్నా.. వైరల్ అవుతున్న పిక్స్..

Whatsapp Image 2024 02 17 At 11.25.21 Pm

Whatsapp Image 2024 02 17 At 11.25.21 Pm

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్‌ వర్మతో ప్రేమలో పడినప్పటి నుంచి మరింత జోష్‌గా కనిపిస్తుంది. ప్రియుడితో కలిసి ప్రపంచాన్ని చూట్టేస్తోంది. తెలుగులో ఆఫర్స్‌ అంతగా లేకపోవడంతో ముంబైకి మకాం మార్చింది. ప్రియుడితో కలిసి ముంబైలో రోడ్లపై చక్కర్లు కొడుతుంది.ఈ క్రమంలో తరచూ వెకేషన్స్‌కు వెళుతుంది. ఈ నేపథ్యంలో తమన్నా- విజయ్‌ వర్మకు ఎంగేజ్‌మెంట్‌ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.వీరిద్దరి రిలేషన్‌ ఆఫీషియల్‌ కావడంతో ఇరు కుటుంబ సభ్యుల నుంచి వీరి పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేసిందని దీంతో ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజు తమన్నా, విజయ్ వర్మకు ఎంగేజ్‌మెంట్ ముహుర్తం ఫిక్స్ అయిందని వార్తలు వచ్చాయి.ఆమె పెళ్లంటూ కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరిగింది. అలాగే పెళ్లి కూడా ఫిక్స్‌ అయ్యిందంటూ గాసిప్స్ వినిపించాయి. కానీ ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.

ఈ క్రమంలో తమన్నా తాజాగా ఎయిర్‌పోర్టులో తళుక్కున మెరిసింది.కార్గో పాయింట్‌ బ్లాక్‌ టాప్‌లో నవ్వుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. దీంతో తమన్నా ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. సింగిల్‌గా ఉన్న తమన్నా చూసి ప్రియుడు ఎక్కడ, పెళ్లప్పుడు అంటూ నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.ప్రస్తుతం తమన్నా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చేతిలో పెద్దగా సినిమాలు లేవు. తెలుగులో చివరిగా సత్యదేవ్‌ సరసన గుర్తుందా శీతాకాలం సినిమాలో నటించింది. రీసెంట్‌గా రజనీకాంత్‌ జైలర్‌లో మూవీలో వా నువ్వు కావాలయ్య.. అంటూ అదిరిపోయే స్టెప్స్ తో ఎంతగానో అలరించింది.అయితే చిరుతో నటించిన భోళా శంకర్ ప్లాప్ అవ్వడంతో ఆమెకు తెలుగులో ఆఫర్స్‌ తగ్గిపోయాయి. హిందీలోనూ ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. దీనితో తమన్నా పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చాయి..