Site icon NTV Telugu

Tamannah : దివ్య భారతి బయోపిక్ లో నటించబోతున్న తమన్నా..?

Whatsapp Image 2023 09 08 At 12.17.21 Pm

Whatsapp Image 2023 09 08 At 12.17.21 Pm

దివ్య భారతి.. ఒకప్పటి ఈ స్టార్ హీరోయిన్ గురించి తెలియని వారు లేరు. తక్కువ ఏజ్ లో నే ఈమె హీరోయిన్ గా స్టార్ డమ్ సంపాధించింది. మూడు సంవత్సరాలలో స్టార్ హీరోల సరసన 20 సినిమాలకు పైగా నటించి మెప్పించింది. 90వ దశకంలో దివ్య భారతి ఇండస్ట్రీ ని ఊపేసింది.ఆ రోజుల్లో ఈ భామ కుర్రాళ్లకు ఆరాధ్య దేవత.ఆమె అందానికి నటనకు అన్నిభాషల్లో స్టార్ మేకర్స్ ఎంతో ఫిదా అయ్యారు స్టార్ హీరోలు కూడా దివ్య భారతి డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసారు..బ్యూటీ క్వీన్ గా ఎదిగి స్టార్ హీరోయిన్ల గుండెల్లో గుబులు పుట్టించింది ఈ భామ. తక్కువ సమయంలో తన నటనతో ప్రభంజనం సృష్టించిన దివ్యభారతి హఠాత్మరణం ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.అయితే ఇప్పటివాళ్లకు ఆమె చనిపోయింది అని తెలుసు కానీ.. ఆమె ఎలా చనిపోయింది అనే విషయం మాత్రం తెలియకపోవచ్చు.

అయితే సినీ అభిమానులకు మాత్రం ఆమె మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అయితే అనుకోని పరిస్థితుల్లో ఆమె చనిపోయింది. దీని మీద చాలా రకాల వాదనలు కూడా ఉన్నాయి. అయితే ఈక్రమంలో దివ్యభారతి జీవితం కథ ఆధారంగా ఆమె బయోపిక్ మూవీ తెరకెక్కబోతున్నట్టు సమాచారం.. అయితే ఈ మూవీ తెరకెక్కెది టాలీవుడ్ లోనో లేక బాలీవుడ్ లోనో కాదు అసలు ఆమె ఒక్క సినిమా కూడా చేయని మలయాళంలో తెరకెక్కుతుంది.ఆమె జీవితం ఆధారంగా మలయాళంలో సినిమాను తీసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.అయితే ఈ సినిమాలో దివ్య భారతి పాత్ర కోసం స్టార్ హీరోయిన్ తమన్నాను సంప్రదించినట్లు సమాచారం.అయితే ఈ పాత్రకు తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అనేది మాత్రం ఇంకా తెలియ లేదు. అయితే దివ్య భారతి పాత్రలో తమన్నా ఎలా ఉంటుంది అనే చర్చజరుగుతుంది. ఒక వేళ ఈ పాత్రకు తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సినిమాను ఏవిధంగా తెరకెక్కిస్తారు అని సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

Exit mobile version