Site icon NTV Telugu

Tamannah Bhatia : తమన్నా ఏడాదికి ఎన్ని కోట్లు సంపాదిస్తుందో తెలుసా?

Tamanna Bhatia

Tamanna Bhatia

స్టార్ హీరోయిన్ తమన్నా గురించి అందరికి తెలుసు.. ఇండస్ట్రీలో వచ్చి ఇరవై ఏళ్లు పూర్తి కావొస్తున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు.. కుర్ర హీరోయిన్ల తో పోటి పడుతూ వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉంది.. అయితే ఈ అమ్మడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను అక్షరాల పాటిస్తోంది. అందుకే అంది వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకుండా చక్కగా సినిమాలు, అడ్వర్టైజ్మెంట్లు, వెబ్ సిరీస్ లలో చేసుకుంటూ పోతోంది. ఈ సందర్భంగా అమ్మడు ఎంత సంపాదిస్తుందో అనే ఆలోచన అందరికి ఉంటుంది..

ప్రస్తుతం తమన్నా ఆస్తుల విలువ రూ.150 కోట్లకు పై మాటే అట.. ఆమె ప్రతినెల రెండు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ల రూపంలో ఆదాయం సంపాదిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన చూస్తే ఆమె ఏటా 16 కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. అంతేకాదు ఆమె ఒక్కో సినిమాకు ఐదు నుంచి ఏడు కోట్లు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తమన్నా యాడ్స్ రూపంలో కూడా భారీగానే సంపాదిస్తోంది..ఇక యాడ్స్ కు తమన్నా రెండు నుంచి మూడు కోట్లు తీసుకుంటుందట.. ఆ లెక్కన చూసుకుంటే అమ్మడు ఏడాదికి బాగానే సంపాదిస్తుంది.. స్టార్ హీరోయిన్స్ కు లేని లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తుంది..

ఇకపోతే తమన్నా తన పెట్టుబడుల విషయానికి వచ్చినట్లయితే వైట్ అండ్ గోల్డ్ పేరిట ఒక ఆన్లైన్ జ్యువెలరీ స్టోర్ ను నడిపిస్తోంది. అలాగే ముంబైలోని వర్సోవ ఏరియాలో ఒక విలాసమైతమైన లగ్జరీ ఫ్లాట్ తమన్నా సొంతం చేసుకుంది. దీని విలువ దాదాపు 20 కోట్లు. అలాగే తమన్నా వద్ద లగ్జరీ కార్డులు సైతం ఉన్నాయి. వీటిలో బీఎండబ్ల్యూ మెర్సిడెస్ బెంజ్ రేంజ్ రోవర్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ అమ్మడు తెలుగు తో పాటు, బాలివుడ్, కొలివుడ్ లలో కూడా సినిమాలు చేస్తుంది.. ఇటీవల లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో కూడా కనిపించింది.. మొత్తంగా చూసుకుంటే రెండు చేతులా బాగానే సంపాదిస్తుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది..

Exit mobile version