Site icon NTV Telugu

Tamannaah: బోల్డ్ సీన్లు చేయనందుకు ఆ స్టార్ హీరో నన్ను అవమానించాడు.. తమన్నా ఆవేదన!

Tamannaah

Tamannaah

Tamannaah: తెలుగు చిత్ర పరిశ్రమలో మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా ప్రముఖ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపూ 15 ఏళ్లు దాటినప్పటికీ క్రేజ్ ఇంకా కొనసాగుతోంది. తమన్నా హీరోయిన్‌గానే కాదు.. ఐటెం సాంగ్స్‌లో సైతం ఇరగదీసింది. బాలీవుడ్, టాలీవుడ్‌లో పలు ఐటెం సాంగ్స్‌తో అదరగొట్టింది. అయితే.. తాజాగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఒక సౌత్ స్టార్ హీరో తనను ఘోరంగా అవమానించాడని వాపోయింది. నోటికొచ్చినట్టు మాట్లాడాడని తెలిపింది.

READ MORE: CM Revanth Reddy: రేపు మహబూబ్‌నగర్‌లో IIITకి శంకుస్థాపన.. సీఎం పర్యటన పూర్తి వివరాలు ఇవే..

“ఒక సినిమా షూటింగ్ సమయంలో ఓ బోల్డ్ సీన్ చేయమన్నారు. నాకు అది నచ్చలేదు. అసౌకర్యంగా ఫీల్ అయ్యాను. కొంత ఇంటిమసీ ఇన్వాల్వ్ అయి ఉండటంతో చేయ్యను అని చెప్పాను. ఆ హీరోకి నా మాటలు నచ్చలేదు. దీంతో సెట్‌లో అందరి ముందు గట్టిగా అరిచాడు. వెంటనే హీరోయిన్‌ను మార్చేయండన్నాడు.”అని తమన్నా తనకు జరిగిన అవమానాన్ని బయటపెట్టింది. ఈ క్షణంలో తనకు ఎంతో బాధ కలిగిందని మిల్కీ బ్యూటీ చెప్పింది. తనను తిట్టిన ఆ స్టార్ హీరో మను నాడే తన వద్దకు వచ్చి క్షమాపణలు కోరినట్లు తెలిపింది. కానీ.. తనను తిట్టిన హీరో పేరు, వివరాలు చెప్పలేదు. తమన్నా ఒక్కసారిగా తనకు జరిగిన అవమానాన్ని బయటపెట్టడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంతకీ మిల్కీ బ్యూటీని తిట్టిన స్టార్ హీరో ఎవరు? అనే సందేహం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.

READ MORE: Tagatose : డయాబెటిస్‌ బాధితులకు ‘స్వీట్’ న్యూస్.. చక్కెరలా రుచి.. కానీ రిస్క్ కాదు.!

Exit mobile version