NTV Telugu Site icon

Tamannaah : ఆ సీన్స్ చేసేటప్పుడు మేల్ యాక్టర్స్ ఎంతో ఇబ్బంది పడుతుంటారు..

Tamannah ..

Tamannah ..

Tamannaah :మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన గ్లామర్,నటనతో  ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.తమన్నా తెలుగులో స్టార్ హీరోల అందరి సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.ప్రస్తుతం ఈ భామకు టాలీవుడ్ లో ఆఫర్స్ తగ్గడంతో ఈ భామ వరుసగా స్పెషల్ సాంగ్స్ తోను ,వెబ్ సిరీస్ తో ఎంతగానో ఆకట్టుకుంటుంది.తాజాగా ఈ భామ ప్రధాన పాత్రలో నటించిన “బాక్” సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుందర్.సి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ రాశీ ఖన్నా కూడా ముఖ్య పాత్రలో నటించింది.

ఈ సినిమా ఆకట్టుకోకపోయిన ఈ సినిమాలో వీరిద్దరూ చేసిన స్పెషల్ సాంగ్ సూపర్ హిట్ అయింది.ఇటీవల తమన్నా వరుసగా స్పెషల్ సాంగ్స్ తో అదరగొడుతుంది.అయితే తమన్నా బాలీవుడ్ లో నటించిన వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సిరీస్ తోనే తమన్నా మొదటి సారి తన నో ముద్దు నిబంధన బ్రేక్ చేసింది.ఈ సిరీస్ లో తమన్నా ముద్దు సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది.ఈ సిరీస్ లో తనతో కలిసి నటించిన విజయ్ వర్మతో రిలేషన్ లో ఉన్నట్లు ఆమె ప్రకటించింది.అయితే తాజాగా తమన్నా ఇంటిమేట్ సీన్స్ లో నటించే మేల్ యాక్టర్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.అలాంటి సీన్స్ లో ఫిమేల్ యాక్టర్స్ కంటే మేల్ యాక్టర్స్ ఎక్కువగా ఇబ్బంది పడతారని ఆమె తెలిపింది.రొమాంటిక్ సీన్స్ లో తన పార్టనర్ కు అసౌకర్యంగా ఉండకుండా చూసుకుంటూ నటించాలి అందుకే మేల్ యాక్టర్స్ అలాంటి సీన్స్ లో కాస్త ఇబ్బంది పడతారని ఆమె తెలిపింది.

Show comments