అందం అనేది చూసేవారి దృష్టిని బట్టి ఉంటుంది అంటారు, కానీ తమన్నా అందం మాత్రం అందరికీ ముచ్చటగొలుపుతునది. సుమారు 20 ఏళ్లుగా వెండితెరపై మ్యాజిక్ చేస్తున్న ఈ 36 ఏళ్ల భామ, ఇప్పటికీ కథానాయికగా ‘నాటౌట్’గా కొనసాగుతుంది. ప్రతి సినిమాలోనూ తన లుక్‌ను మారుస్తూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చే తమన్నా, కేవలం హీరోయిన్‌గానే కాకుండా ఐటెం సాంగ్స్‌లోనూ తనదైన ముద్ర వేసింది. గతంలో ‘జైలర్’ వంటి చిత్రాల్లో ఒక్క స్పెషల్ సాంగ్ కోసం రూ. 6 కోట్ల వరకు డిమాండ్ చేసిన ఈ బ్యూటీ, అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే ఐటెం గర్ల్‌గా రికార్డు సృష్టించింది. అయితే మధ్యలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇకపై స్పెషల్ సాంగ్స్ చేయనని ప్రకటించినప్పటికీ, తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుని మళ్ళీ అగ్ర హీరోల చిత్రాల్లో చిందేయడానికి సిద్ధమవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Bhumika : రాత్రంతా నిద్రపోలేదు..స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న భూమిక..
తమన్నా కెరీర్‌తో పాటు ఆమె వ్యక్తిగత జీవితం కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఇందులో భాగంగానే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో సాగించిన ప్రేమాయణం కొంతకాలం హల్చల్ చేసినా, ప్రస్తుతం వారిద్దరూ విడిపోయారని, ఆ బంధం ‘మూడునాళ్ల ముచ్చట’గానే మిగిలిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన నిర్ణయాల మార్పుపై స్పందిస్తూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.. ‘నా మనసును నేనే సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాను, ఇక ఇతరులు నన్ను ఎలా అర్థం చేసుకుంటారు?’ అంటూ నెటిజన్ల కామెంట్లకు తనదైన శైలిలో బదులిచ్చారు. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ సుందర్.సి దర్శకత్వంలో విశాల్ సరసన నటించేందుకు ఈ మిల్కీ బ్యూటీ సిద్ధమవుతోంది. తన కెరీర్ జీవితం విషయంలో ఆమె తీసుకుంటున్న ఈ ఆకస్మిక మార్పులు నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి.
