Site icon NTV Telugu

Tamannaah : అవకాశాలు ఉన్నప్పుడే.. ఆ విషయంలో జాగ్రత్త పడాలి.. లేదంటే ఇబ్బందులే!

Tamannah

Tamannah

టాలీవుడ్ ‘మిల్కీ బ్యూటీ’ తమన్నా (Tamannaah) కేవలం వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారని మరోసారి నిరూపించుకున్నారు.15 ఏళ్లకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, దాదాపు 20 ఏళ్లుగా టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న ఆమె, నటీనటుల ఆర్థిక క్రమశిక్షణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా రంగంలో గ్లామర్ ఉన్నప్పుడే భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టాలని, లేదంటే కెరీర్ ముగిశాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించింది..

Also Read : Varanasi : ఇండియన్ సినిమా డెఫినిషన్ మార్చే సినిమా ఇది.. మహేష్-రాజమౌళి ‘వారణాసి’పై ప్రియాంక చోప్రా ప్రశంసలు!

తాజా ఇంటర్వ్యూలో తమన్నా తన ఆర్థిక ప్రణాళికల గురించి మాట్లాడుతూ.. ‘నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నా ఆర్థిక వ్యవహారాలన్నీ మా నాన్నగారే చూసుకునేవారు. ఆయనే నాకు రియల్ ఎస్టేట్, జువెలరీ బిజినెస్ వంటి వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం నేర్పించారు. ఇండస్ట్రీలో ప్రతి శుక్రవారం ఒకరి తలరాత మారిపోతుంది. అందుకే అవకాశాలు ఉన్నప్పుడే సంపాదించిన డబ్బును సరైన మార్గాల్లో ఆదా చేసుకోవాలి’ అని ఆమె సూచించారు. అందుకే ప్రస్తుతం తమన్నా నటిగానే కాకుండా విజయవంతమైన వ్యాపారవేత్తగా కూడా రాణిస్తున్నారు. ఇప్పటికే నగల వ్యాపారం, రియల్ ఎస్టేట్‌లో ఆమె భారీగా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. నటీనటులకు దూరదృష్టి లేకపోతే చివరకు ఏమీ మిగలదని, అందుకే ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు.

Exit mobile version