Site icon NTV Telugu

Jailer : వైరల్ అవుతున్న తమన్నా హాట్ లుక్..

Whatsapp Image 2023 07 05 At 10.15.59 Pm

Whatsapp Image 2023 07 05 At 10.15.59 Pm

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ నటిస్తున్న లేటెస్ట్ సినిమా జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ మూవీ నుంచి మేకర్స్‌ ఇప్పటికే విడుదల చేసిన తమన్నా లుక్‌ నెట్టింట బాగా వైరల్ గా మారింది. జైలర్‌ ఫస్ట్‌ సింగిల్‌.. కావాలా సాంగ్‌ను జులై 6 న విడుదల చేయబోతున్నారు. దీనితో నాతో డాన్స్ చేయడానికి రెడీ గా వున్నారా అంటూ చేసిన తమన్నా పోస్ట్ బాగా వైరల్ అయింది.సాంగ్ విడుదల తేదీ కంటే ఒక రోజు ముందు గానే సాంగ్‌ లో తమన్నా హాట్ లుక్ ను విడుదల చేసారు.ఈ సాంగ్ ను రేపు సాయంత్రం 6 గంటలకు లాంఛ్ చేయనున్నట్టు సన్ పిక్చర్స్‌ ట్వీట్ చేసింది. తమన్నా అదిరిపోయే స్టెప్పులతో ఎంతో హాట్ గా డ్యాన్స్ చేయబోతున్నట్టు తాజా లుక్‌తో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్‌.

జైలర్‌ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్,టాలీవుడ్ యాక్టర్ సునీల్‌, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్‌, రమ్యకృష్ణ మరియు యోగిబాబు వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జైలర్‌ నుంచి మేకర్స్‌ ఇప్పటికే లాంఛ్ చేసిన మోహన్‌ లాల్‌, సునీల్‌ మరియు తమన్నా లుక్స్ నెట్టింట్లో బాగా వైరల్ గా మారాయి.. ఈ మూవీని సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్‌ తెరకెక్కిస్తున్నారు.. యాక్షన్‌ కామెడీ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న జైలర్‌ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.రీసెంట్ గా తమన్నా జీ కర్థ, లస్ట్ స్టోరీస్ 2 వంటి రెండు వెబ్ సిరీస్ లలో ఎంతో బోల్డ్ గా నటించి మెప్పించింది. ఈ రెండు సిరీస్ లలో తమన్నా బోల్డ్ పెర్ఫార్మన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.అలాగే తమన్నా తెలుగులో చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ్ లో సూపర్ స్టార్ తెలుగులో మెగా స్టార్ సినిమాల పైనే తమన్నా ఎన్నో హోప్స్ పెట్టుకుంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే ఆమెకు మళ్ళీ వరుస ఆఫర్స్ వస్తాయి.

Exit mobile version