మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో నువ్వు కావాలయ్యా సాంగ్ లో నటించింది.. ఆ సినిమా కన్నా పాట బాగా హిట్ అయ్యింది. దాంతో సినిమా సూపర్, డూపర్ హిట్ అయ్యింది.. తమన్నా క్రేజ్ కూడా బాగా పెరిగింది.. ఒక్కపాట తన లైఫ్ కు బిగ్ టర్నింగ్ పాయింట్ అయ్యింది.. ప్రస్తుతం ఈ అమ్మడు వేకేషన్ ను ఎంజాయ్ చేస్తుంది.. ఈ సందర్భంగా బీచ్ లో బికినీలో రచ్చ చేస్తూ అందాల దర్శనం చేసింది. మతులు పోయే ఫోజులతో నెట్టింట హీట్ పెంచుతోంది..
ఈ అమ్మడు కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. కొన్నేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు కోలీవుడ్ లోనూ సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా వరుస చిత్రాలు, సిరీస్ లు చేస్తోంది.. గతంలో తన నటన, డాన్స్, అందంతో సెపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది. కానీ ప్రస్తుతం కెరీర్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అప్పటి రూల్స్ ను బ్రేక్ చేస్తూ సెన్సేషన్ గా మారుతోంది. బోల్డ్ లుక్స్ లో వెండితెరపై మెరుస్తూ ఆశ్చర్యపరుస్తోంది.. ఇక ‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్ లతో ఎంత రచ్చ చేసిందో తెలిసిందే. బోల్డ్ పెర్ఫామెన్స్ తో ముతులు పోగొట్టింది. ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియెన్స్ కు కూడా మిల్క్ బ్యూటీ షాకిచ్చింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ అందాల రచ్చ చేస్తోంది..
ప్రస్తుతం తమన్నా భాటియా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. సోనేవా ఫుషి అనే రీస్టార్ట్ లో దిగిన మిల్క్ బ్యూటీ బీచ్ లో తిరుగుతూ కనిపించింది. తాజాగా ఆమె వెకేషన్ కు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ మధ్య వరుసగా బికినీల్లో అందాల ప్రదర్శన చేస్తూ నెట్టింట మంటలు రేపుతోంది. లేటెస్ట్ గా పింక్ బీచ్ వేర్, బ్రౌన్ వేర్ లో దర్శనమిచ్చింది.. తాజాగా ఫొటోలను ఫ్యాన్స్ ను లైక్స్,, కామెంట్లతో నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు.. సినిమాల విషయానికొస్తే.. కొన్ని ప్రాజెక్ట్ లలో నటించనుంది..