Afghanistan: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఘర్షణలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలలో భారత్ పాత్ర ఉందని ఆరోపించిన పాకిస్థాన్‌కు తాలిబన్ రక్షణ మంత్రి మౌల్వి మొహమ్మద్ యాకూబ్ ముజాహిద్ దిమ్మతిరిగిపోయే ఆన్సర్ ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇస్లామాబాద్‌తో మెరుగైన పొరుగు సంబంధాలను, విస్తృత వాణిజ్యాన్ని కాబూల్ కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే భారతదేశం పాత్ర గురించి పాక్ ఆరోపించిన విషయాన్ని అడిగినప్పుడు, “ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. మా భూభాగాన్ని మరే ఇతర దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించకూడదనేది మా విధానం” అని అన్నారు.
READ ALSO: ODI World Cup 2025: శ్రీలంక విజయం.. భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టం! ఇక అదొక్కటే దారి
రక్షణ మంత్రి మౌల్వి యాకూబ్ మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్థాన్ భారతదేశంతో స్వతంత్ర దేశంగా సంబంధాలను కొనసాగిస్తుందని, జాతీయ ప్రయోజనాల చట్రంలో ఈ సంబంధాలను బలోపేతం చేయడం కొనసాగిస్తుందని అన్నారు. “మా లక్ష్యం సంబంధాలను విస్తరించడం, ఉద్రిక్తతలు సృష్టించడం కాదు. పాకిస్థాన్ ఆరోపణలు నిరాధారమైనవి, ఆచరణాత్మకమైనవి, ఆమోదయోగ్యం కానివి” అని అన్నారు. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ పొరుగు దేశాలు. వాటి మధ్య ఉద్రిక్తత ఎవరికీ ప్రయోజనం కలిగించదు. సంబంధాలు పరస్పర గౌరవం, పొరుగు సూత్రాలపై ఆధారపడి ఉండాలని ఆయన అన్నారు.
దోహా ఒప్పందం అమలుపై తుర్కియేలో సమావేశం జరగనుంది.
ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్థాన్ – పాకిస్థాన్ మధ్య దోహా ఒప్పందం పురోగతిపై తదుపరి సమావేశం తుర్కియేలో జరుగుతుందని చెప్పారు. ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి, పర్యవేక్షించడానికి యంత్రాంగం గురించి ఇక్కడ చర్చించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఒప్పందంలోని ప్రతి నిబంధనకు అన్ని పార్టీలు కట్టుబడి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఒప్పందంలోని అన్ని నిబంధనలకు కాబుల్ పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు. పాకిస్థాన్ తన బాధ్యతలను నెరవేర్చకపోతే, సమస్యలు తలెత్తుతాయి అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఇస్లామాబాద్ – కాబూల్ మధ్య ఒప్పందాన్ని అమలు చేయడంలో సహాయం చేయాలని టర్కీ, ఖతార్ వంటి మధ్యవర్తిత్వ దేశాలకు కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.
ఏదైనా దేశం ఆఫ్ఘనిస్థాన్‌పై దాడి చేస్తే.. ఆఫ్ఘన్ ప్రజలు ధైర్యంగా తమ దేశాన్ని రక్షించుకుంటారని మౌల్వీ యాకూబ్ ముజాహిద్ పేర్కొన్నారు. ఆఫ్ఘన్ ప్రజలు తమ మాతృభూమిని రక్షించుకోవడానికి నిలబడిన చరిత్ర ఉందని ఆయన అన్నారు. పాకిస్థాన్ తన రాజకీయ ప్రత్యర్థులను “ఉగ్రవాదులు” అని పిలుస్తుందని, “ఉగ్రవాది” అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఎప్పుడూ లేదని ఆయన చెప్పారు. ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ విధానం ఏ దేశానికి వ్యతిరేకంగా లేదని, అలాగే పాకిస్థాన్‌తో సహా సాయుధ గ్రూపులకు మద్దతు ఇవ్వకూడదని ఉందని స్పష్టం చేశారు.
READ ALSO: My Son Temple Vietnam: వియత్నాం హిందూ దేవాలయానికి యునెస్కో గుర్తింపు..
