US senator Marsha Blackburn visits Taiwan: యూఎస్ స్పీకర్ నాన్సిపెలోసి తైవాన్ పర్యటన తైవాన్ – చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. నాన్సి పెలోసీ పర్యటనను డ్రాగన్ కంట్రీ వ్యతిరేకించింది. అమెరికాకు నిప్పుతో చెలగాటం అడుతున్నారంటూ వార్నింగ్ ఇచ్చింది. అయితే తాజాగా మరో అమెరికన్ లీడర్ తైవాన్ లో పర్యటిస్తున్నారు. తాజాగా అమెరికన్ సెనెటర్, టెన్సెసీకి చెందిన రిపబ్లికన్ నేత మార్షా బ్లాక్‌బర్న్ గురువారం తైవాన్ చేరారు. ప్రత్యేక విమానంలో తైపీ సాంగ్ షాన్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు.
చైనాకు సందేశం పంపడానికి తైవాన్ లో అడుగపెట్టానని.. చైనాకు భయపడేది లేదని..ఆమె ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛను కాపాడేందుకు అమెరికా దృఢంగా ఉందని ఆమె అన్నారు. అమెరికా మిత్రదేశాలను అణగదొక్కే ప్రయత్నాలను సహించదని వ్యాఖ్యానించారు. అయితే అమెరికా లీడర్ మరోసారి తైవాన్ ను సందర్శించడంపై ఆదేశ విదేశాంగ శాఖ కృతజ్ఞతలు తెలియజేసింది. ఒకే నెలలో నలుగురు యూఎస్ రాజకీయ నాయకులు తైవాన్ లో పర్యటించారు. యూఎస్ స్పీకర్ నాన్సి పెలోసి పర్యటన తర్వాత సెనేటర్ ఎడ్ మార్కీ నేతృత్వంలోని మరో కాంగ్రెస్ ప్రతినిధి బృందం, ఇండియానా రిపబ్లికన్ గవర్నర్ ఎరిక్ హోల్‌కాంబ్ తైవాన్ లో పర్యటించారు. తాజాగా మార్షా బ్లాక్‌బర్న్ తైవాన్ లో పర్యటిస్తున్నారు.
Read Also: Irfan Pathan: విస్తారా ఎయిర్‌లైన్స్‌పై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం.. అసలు ఏం జరిగిందంటే..?
ఇదిలా ఉంటే ఈ పర్యటనపై చైనా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే నాన్సీ పెలోసి పర్యటన తర్వాత అమెరికా, చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. వన్ చైనా విధానంలో తైవాన్ కూడా భాగమే అని చైనా వాదిస్తోంది. అయితే నాన్సి పెలోసీ పర్యటన తర్వాత చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. చైనా తన యుద్ధవిమానాలు, క్షిపణులను, యుద్ధ నౌకలను తైవాన్ చుట్టూ మోహరించింది. అవసరమైతే తైవాన్ ను హస్తగతం చేసుకుంటామని చైనా ప్రకటించింది.
