NTV Telugu Site icon

Earthquakes: తైవాన్‌లో 200 భూకంపాలు.. కూప్పకూలిన భవనాలు

Eaee

Eaee

తైవాన్‌ను వరుస భూకంపాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇటీవలే భారీ భూకంపంతో అల్లాడిపోయింది. ఇంతలోనే సోమవారం మరోసారి భూకంపం సంభవించింది. ఇంతలోనే మరోసారి మంగళవారం తెల్లవారుజామున కూడా 200 సార్లు భూకంపాలు వచ్చినట్లుగా వార్తలు అందుకున్నాయి. అయితే స్వల్ప ఆస్తి నష్టాలు జరిగాయని.. ప్రాణ నష్టాలు మాత్రం జరగలేదని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: AP News: పలువురు కీలక పోలీస్ అధికారులపై ఈసీ బదిలీ వేటు..

తైవాన్‌లో సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య దేశంలోని తూర్పు తీరంలో పలుమార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. వీటిలో అత్యధిక తీవ్రత 6.3, 6గా నమోదైంది. హువాలియన్ తూర్పు కౌంటీలో భూమికి 5.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. భూకంపం ధాటికి హువాలియన్‌లోని పలు భవనాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో జపాన్, చైనా, ఫిలిప్పీన్స్‌లో కూడా తేలికపాటి ప్రకంపనలు సంభవించాయి. ప్రస్తుతం ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదు.

ఇది కూడా చదవండి: Rishi Sunak: రువాండా బిల్లుకు బ్రిటన్ ఆమోదం.. ఐరాస ఆందోళన

ఇక ఇటీవల సంభవించిన భూకంపానికి పలువురు మృతిచెందగా.. పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. ఈ పరిస్థితుల నుంచి కోలుకోకముందే మరోసారి భూప్రకంపనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థంకాక ప్రజలు భయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: Lok sabha election: 4 రాష్ట్రాలకు హీట్ వేవ్ ఎఫెక్ట్.. 26న పోలింగ్ తగ్గనుందా?