NTV Telugu Site icon

Aadudam Andhra: ఆర్డీవో బౌలింగ్.. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బ్యాటింగ్

Mla Kethireddy Peddareddy

Mla Kethireddy Peddareddy

Aadudam Andhra: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని మంగళవారం సీఎం జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లా కు సంబంధించి తాడిపత్రి నియోజకవర్గంలో తాడిపత్రి రూరల్ పెద్దపొలమడ క్రీడాప్రాంగణంలో “ఆడుదాం ఆంధ్ర” క్రీడా పోటీలను ప్రారంభించిన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రారంభించారు. మొదట ఎమ్మెల్యే జెండా వందనం గావించి అనంతరం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బ్యాటింగ్ చేయగా.. అనంతపురం జిల్లా ఆర్డీవో గ్రంథి వెంకటేశ్‌ బౌలింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైసీపీ పార్టీ నాయకులు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Read Also: Actor Ali: ప్రతి నిరుపేదకు ఇల్లు ఉండాలనే సీఎం జగన్ ఆలోచన గొప్పది..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర ఇది అందరి ఆట కార్యక్రమం ద్వారా గ్రామీణ స్థాయి లో వివిధ నైపుణ్యాలు కలిగిన వారిని ఎంపిక చేసి వారిని మండల స్థాయి, నియోజకవర్గస్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి వరకు పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా క్రికెట్, కోకో, వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్‌ ఆటలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ఈ ఆటలో పాల్గొనేందుకు ఉత్సాహాన్ని చూపిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆటలు నేటి నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు సచివాలయ స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.