Tabraiz Shamsi: దక్షిణాఫ్రికా స్టార్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తబ్రేజ్ షంషికి జోహన్నెస్‌బర్గ్ హైకోర్టులో భారీ విజయం లభించింది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) విషయంలో క్రికెట్ సౌతాఫ్రికా (CSA) తో సాగుతున్న వివాదంలో కోర్టు షంషికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో షంషి విదేశీ టీ20 లీగ్‌ల్లో ఆడేందుకు ఉన్న అడ్డంకులు తొలిగాయి.
PSL vs IPL: ఐపీఎల్‌ను విమర్శించినందుకు వసీం అక్రమ్‌కు పాకిస్థాన్ బహుమతి
ఈ గొడవ SA20 వేలంతో మొదలైంది. వేలంలో షంషిని ‘ఎంఐ కేప్ టౌన్’ ఫ్రాంఛైజీ 5 లక్షల రాండ్లకు కొనుగోలు చేసింది. అయితే షంషి ఆ ఫ్రాంఛైజీతో ఒప్పందం కుదుర్చుకోవడానికి నిరాకరించారు. అదే సమయంలో ఆయన ఇతర అంతర్జాతీయ లీగ్‌లైన ILT20 (UAE), బిగ్ బాష్ లీగ్ (AUS) లలో ఆడేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. అయితే విదేశీ లీగ్‌లలో ఆడాలంటే సొంత దేశ బోర్డు (CSA) నుంచి NOC తప్పనిసరి. అయితే SA20 వేలంలో అమ్ముడైన ఆటగాడు ఖచ్చితంగా ఆ లీగ్‌లోనే ఆడాలనే నిబంధనను సాకుగా చూపుతూ CSA షంషికి NOC ఇవ్వడానికి నిరాకరించింది.
అయితే మరోవైపు బోర్డు నిర్ణయం తన జీవనోపాధిని దెబ్బతీస్తోందని, రాజ్యాంగబద్ధమైన హక్కులను ఉల్లంఘిస్తోందని షంషి జోహన్నెస్‌బర్గ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. SA20 లీగ్‌లో బోర్డుకు వాటాలు ఉన్నందున, తన ప్రయోజనాల కంటే బోర్డు సొంత లాభాల కోసమే NOC నిరాకరిస్తోందని ఆయన వాదించారు. ప్రధానంగా SA20 ఫ్రాంఛైజీతో తనకు నేరుగా ఎలాంటి ఒప్పందం లేదని షంషి గుర్తుచేశారు.
Massive Fire Breaks Out in Ernakulam Express: మరో ఘోర ప్రమాదం.. ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..
ఈ విషయమై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. క్రికెట్ సౌతాఫ్రికా వాదనను తోసిపుచ్చింది. షంషికి తక్షణమే NOC జారీ చేయాలని ఆదేశించింది. ఆటగాడి వృత్తిని, సంపాదనను అడ్డుకునే అధికారం బోర్డుకు లేదని స్పష్టం చేసింది. దీంతో షంషి ఇప్పుడు అడిలైడ్ స్ట్రైకర్స్ (BBL) మరియు ILT20 లీగ్‌ల్లో పూర్తిస్థాయిలో ఆడేందుకు మార్గం సుగమమైంది.నిజానికి షంషి గత అక్టోబర్ (2024) లోనే CSA సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి వైదొలిగారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ టీ20 లీగ్‌ల్లో స్వేచ్ఛగా ఆడేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కాంట్రాక్ట్ లేకపోయినప్పటికీ దక్షిణాఫ్రికా తరఫున కీలక ద్వైపాక్షిక సిరీస్‌లు మరియు ఐసీసీ (ICC) టోర్నీల్లో ఆడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు.
