Site icon NTV Telugu

Jennifer Mistry Bansiwal: నిర్మాతపై టెలివిజన్‌ నటి లైంగిక వేధింపుల ఆరోపణలు

Tmkoc

Tmkoc

Jennifer Mistry Bansiwal: టెలివిజన్ నటి జెన్నిఫర్ బన్సీవాల్ ‘తారక్ మెహతా కా ఊల్తా చష్మా’ టీవీ షో నుంచి తప్పుకున్నారు. ‘తారక్ మెహతా కా ఊల్తా చష్మా’ నిర్మాత అసిత్ మోడీపై నటి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఆమె అతనిపై తీవ్ర ఆరోపణలు చేసింది. అసిత్‌పై ఆరోపణలు చేయడమే కాకుండా, షో ప్రాజెక్ట్ హెడ్ సోహైల్ రమణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జతిన్ బజాజ్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని జెన్నిఫర్ ఆరోపించింది. వారు తప్పుగా ప్రవర్తించడం వల్లే షో నుంచి తప్పుకున్నానని ఆమె ఆరోపణలు చేశారు

ఇదిలా ఉండగా.. అసిత్ మోడీ తనపై వచ్చిన అన్ని ఆరోపణలను ఖండించారు. జెన్నిఫర్ బన్సీవాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్మాత నిర్ణయించుకున్నారు. జెన్నిఫర్‌ తనతో పాటు, తారక్ మెహతా కా ఊల్తా చష్మా షో పరువు తీసేందుకు ప్రయత్నిస్తోందని.. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు.నటి తనపై, షో మేకర్స్‌పై నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేసిందని ఆయన అన్నారు. మరోవైపు, తారక్ మెహతా కా ఊల్తా చష్మా షో సెట్‌లో జెన్నిఫర్ అందరితో అనుచితంగా ప్రవర్తించేదని సోహైల్ రమణి, జతిన్ బజాజ్ పేర్కొన్నారు. సెట్‌లో ఆమె ప్రవర్తన చెడుగా ఉన్నందున వారు నటి ఒప్పందాన్ని రద్దు చేయాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. ఇప్పటికే ఫిర్యాదు నమోదు చేసినట్లు వీరిద్దరూ ధృవీకరించారు.

Read Also: Adipurush: మరో కొత్త వివాదంలో ‘ఆదిపురుష్’! ఈ కర్ణుడి కష్టాలేంటో?

టెలివిజన్ నటి జెన్నిఫర్ బన్సీవాల్ ‘తారక్ మెహతా కా ఊల్తా చష్మా’ షో నుంచి తప్పుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ధృవీకరించారు. తన చివరి ఎపిసోడ్‌ని ఈ సంవత్సరం మార్చి 6న చిత్రీకరించామన్నారు. అయితే, మార్చి 7న షో సెట్స్‌లో రమణి, బజాజ్ ఇద్దరూ తనతో అనుచితంగా ప్రవర్తించారని బన్సీవాల్ ఆరోపించారు.

Exit mobile version