Site icon NTV Telugu

Taapsee : ఆ విషయంలో హీరోయిన్స్ నే ఎందుకు తప్పుబడతారు..

Whatsapp Image 2023 08 01 At 8.11.49 Pm

Whatsapp Image 2023 08 01 At 8.11.49 Pm

తాప్సీ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బామ  కె రాఘవేంద్రరావు మంచు మనోజ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఝుమ్మంది నాదం సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఇలా మొదటి సినిమాతోనే తనలోని గ్లామర్ తో ఎంతగానో అలరించింది.ఈమె తరువాత పలు తెలుగు సినిమాలలో కూడా నటించింది.. అయితే ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమెకు తెలుగు లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో ఈ భామ బాలీవుడ్ బాట పట్టింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ సినిమాలో  నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఈ విధంగా బాలీవుడ్ లో మంచి సక్సెస్ సాధించిన తాప్సీ ఒక నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు. ఈ భామ ఏ విషయం గురించి అయినా కూడా సూటిగా సమాధానం చెబుతూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

అయితే తాప్సీ తాజాగా తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాను టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసే సమయంలో వరుసగా నాకు ఫ్లాప్స్ వచ్చాయి అయితే ఆ సమయంలో నాపై చాలామంది ఎన్నో విమర్శలను చేశారు. ఇలా సినిమాలు ఫ్లాప్ అయితే ఆ తప్పు హీరోయిన్ల పైన ఎందుకు వేస్తున్నారు అని ఆమె ప్రశ్నించారు.హీరోయిన్లు కొన్ని సన్నివేశాలు మరియు పాటలలో మాత్రమే కనిపిస్తారు. అలాంటిది సినిమా ఫ్లాప్ అవ్వడానికి హీరోయిన్లే ఎందుకు భాద్యులు అవుతారు అని ఆమె ప్రశ్నించింది.. కెరీర్ మొదటిలో నాకు ఎలాంటి కథలు ఎంపిక చేసుకోవాలో కూడా అస్సలు తెలిసేది కాదు దానితో నేను చేసిన సినిమాలు ప్లాప్ గా నిలిచాయి. ప్రస్తుతం నేను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని ఆమె తెలిపారు. కెరియర్ మొదట్లో ఇలాంటి విమర్శల కారణంగా నేను ఎంతో బాధపడ్డాను. కానీ ఈ సమయంలో అయితే నేను వాటి గురించి అసలు ఆలోచించడం లేదు అని తెలియజేసింది.

Exit mobile version