Taapsee : సెట్‌లో ప్యాడెడ్ బ్రా వేసుకోమనేవారు.. మరోసారి సౌత్ డైరెక్టర్ల పై మండిపడ్డ తాప్సీ ..

Tapsee Pannu

Tapsee Pannu

టాలీవుడ్ ద్వారా వెండితెరకు పరిచయమై, ఇప్పుడు బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ పన్ను. తాప్సీ ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడటానికి ఇష్టపడుతుంది. తాజాగా తన కొత్త సినిమా ‘అస్సీ’ (#ASSIMovie) ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ల గ్లామర్ విషయంలో దర్శకులు చేసే కొన్ని డిమాండ్ల గురించి సంచలన విషయాలు బయటపెట్టింది.

Also Read : Priyanka Chopra : నన్ను ఇండస్ట్రీ నుంచి గెంటేశారు.. ప్రియాంక వైరల్ కామెంట్స్..!

దక్షిణాది సినిమాల్లో హీరోయిన్ల ఫిజిక్, లుక్స్ విషయంలో చాలా పట్టుబడతారని తాప్సీ చెప్పుకొచ్చింది. ‘సౌత్‌లో షూటింగ్ చేసేటప్పుడు చాలా సార్లు నన్ను ‘ప్యాడెడ్ బ్రా’ వేసుకోమని చెప్పేవారు. నిజానికి ఆ విషయాన్ని సెట్‌లో డైరెక్టర్ ఎవరితో చెప్పాలో తెలియక ఇబ్బంది పడేవారు. చివరకు ఆ విషయం నా వరకు వచ్చినప్పుడు నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది.. ముఖ్యంగా పాటల షూటింగ్ జరుగుతున్నప్పుడు, అందరి ముందూ అలాంటి మార్పులు గురించి మాట్లాడటం, అందరూ మన వైపు చూడటం అనేది ఒక నటిగా చాలా అసౌకర్యంగా ఉంటుంది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో కూడా తాప్సీ తెలుగు దర్శకులు హీరోయిన్ల బొడ్డుపై కొబ్బరికాయలు కొట్టడం లేదా పండ్లు వేయడం వంటి సీన్ల గురించి కామెంట్స్ చేసి వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ గ్లామర్ ఇండస్ట్రీలోని ఇలాంటి అంతర్గత విషయాలను బయటపెట్టడంతో ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.