Site icon NTV Telugu

T20 World Cup 2024: టీమిండియా మ్యాచ్‌ పూర్తి షెడ్యూల్ ఇలా.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడొచ్చంటే..

T20 2024

T20 2024

మే 30 ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ తొమ్మిదో ఎడిషన్ జూన్ 2న టెక్సాస్‌ లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో ప్రారంభ మ్యాచ్‌ లో కెనడాతో సహ-హోస్ట్ అమెరికాతో తలపడనుంది. 2007లో ప్రారంభ ఎడిషన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన భారత్, జూన్ 5 న ఐర్లాండ్‌ తో తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2024 కోసం అమెరికాలో మొత్తం మూడు, కరేబియన్‌ లోని ఆరు వేదికలు ఉపయోగించబడతాయి. T20 ప్రపంచ కప్ లో మొత్తం 55 మ్యాచ్‌ లు, 20 జట్లు తొమ్మిది వేదికల్లో ఆడతాయి. జూన్‌ 29 బార్బడోస్‌లో ఫైనల్‌తో ముగుస్తుంది.

Pragyananda Defeat Carlsen: సంచలనం.. కార్ల్‌సెన్‌ పై ప్రజ్ఞానంద తొలి విజయం..

ఈ ఈవెంట్ ఐదు జట్లతో ఉన్న 4 గ్రూపులుగా విభజించబడింది. ప్రతి గ్రూప్ నుండి సూపర్ ఎనిమిది దశకు చేరుకుంటాయి. ఆ తర్వాత మొదటి నాలుగు జట్లు నాకౌట్ సెమీఫైనల్స్ చేరి చివరగా సెమీఫైనల్స్ విజేతలతో ఫైనల్‌ జరుగుతుంది. గ్రూప్ A లో సహ-ఆతిథ్య USA తోపాటు, చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్, అలాగే కెనడా, ఐర్లాండ్ లు ఉన్నాయి. ఇక గ్రూప్ Bలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా , నమీబియా, స్కాట్లాండ్, ఒమన్‌ లు ఉన్నాయి. ఇక గ్రూప్ Cలో వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, పాపువా న్యూ గినియాలు ఉన్నాయి. గ్రూప్ Dలో దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ లు ఉన్నాయి.

USAలో ఐసీసీ T20 ప్రపంచ కప్ వేదికల వివరాలు చూస్తే.. టెక్సాస్ గ్రాండ్ ప్రైరీ స్టేడియం, ఫ్లోరిడా సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం, న్యూయార్క్ నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలు ఆతిధ్యం ఇవ్వనున్నాయి. ఇక వెస్టిండీస్‌లో ఐసీసీ T20 ప్రపంచ కప్ 2024 వేదికల వివరాలు చూస్తే.. సెయింట్ విన్సెంట్ & ది గ్రెనడైన్స్: ఆర్నోస్ వేల్ స్టేడియం, ఆంటిగ్వా మరియు బార్బుడా: సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, బార్బడోస్: కెన్సింగ్టన్ ఓవల్, సెయింట్ లూసియా: డారెన్ సామీ క్రికెట్ గ్రౌండ్, ట్రినిడాడ్ మరియు టొబాగో: బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ, ప్రొవిడెన్స్, గయానా: ప్రొవిడెన్స్ స్టేడియంలు ఆతిధ్యం ఇవ్వనున్నాయి.

ఐసీసీ T20 వరల్డ్ కప్ 2024 భారతదేశంలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఈ టోర్నీని హిందీ, తమిళం, తెలుగు మరియు కన్నడ భాషల్లో ప్రసారం చేస్తుంది. అలాగే ప్రత్యక్ష ప్రసారం డిస్నీ + హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంటుంది. ఇక భారత ఐసీసీ T20 ప్రపంచ కప్ 2024 జట్టులో రోహిత్ శర్మ (సి), హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర సింగ్ చాహల్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్. సిరాజ్. రిజర్వ్‌లు: శుభమన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్ లు ఉన్నారు.

భారత కాలమానం ప్రకారం ఐసీసీ T20 ప్రపంచకప్ లో భారత షెడ్యూల్ చూస్తే..

జూన్ 5: భారతదేశం vs ఐర్లాండ్: నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, న్యూయార్క్ 8:00 PM (IST)

జూన్ 9: భారత్ vs పాకిస్థాన్: నస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, న్యూయార్క్ 8:00 PM (IST)

జూన్ 12: భారతదేశం vs USA: నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, న్యూయార్క్ 8:00 PM (IST)

జూన్ 15: ఇండియా vs కెనడా: సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్ & బ్రోవార్డ్ కౌంటీ స్టేడియం, లాడర్‌హిల్, ఫ్లోరిడా, రాత్రి 8:00 (IST)

Exit mobile version