NTV Telugu Site icon

ICC T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ.. ఎంతో తెలుసా?

New Project (26)

New Project (26)

జూన్ రెండున టీ-20 ప్రపంచ కప్ 2024 ప్రారంభమైంది. ఈ సారి వెస్టిండీస్‌, అమెరికాలు వేదికకానున్నాయి. ఈ సారి టీంలపై డబ్బుల వర్షం కురవనుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టీ20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ప్రకటించింది. ICC T20 వరల్డ్ కప్ 2024 గెలిచిన జట్టు సుమారు రూ. 20.36 కోట్లు ($2.45 మిలియన్లు) అందుకుంటుంది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారి విజేత జట్టు ఇంత మొత్తం అందుకోవడం విశేషం. అయితే ఫైనల్‌లో ఓడిన జట్టు అంటే రన్నరప్‌గా నిలిచిన జట్టుకు దాదాపు రూ. 10.64 కోట్లు ($1.28 మిలియన్లు) అందజేయనున్నారు.

READ MORE: BSF Recruitment 2024: అలర్ట్.. భారత సైన్యంలో పలు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

సెమీ-ఫైనల్‌కు చేరుకునే మిగిలిన రెండు జట్లకు సమాన మొత్తంలో రూ. 6.54 కోట్లు ($787,500) ఇస్తారు. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో 20 జట్లు పాల్గొంటున్నాయి. ప్రతి జట్టుకు ఐసీసీ కొంత మొత్తాన్ని అందజేస్తుంది. సూపర్-8 (రెండో రౌండ్) దాటి ముందుకు సాగని ప్రతి జట్లకు $382,500 (సుమారు రూ. 3.17 కోట్లు) అందుతాయి. తొమ్మిదో స్థానం నుంచి 12వ స్థానాల్లో నిలిచిన జట్లకు ఒక్కొక్కరికి $247,500 (సుమారు రూ. 20.57 కోట్లు) అందుతాయి. 13 నుంచి 20వ ర్యాంక్‌లో ఉన్న జట్లకు ఒక్కొక్కరికి $225,000 (సుమారు రూ. 1.87 కోట్లు) ఇస్తారు. T20 ప్రపంచ కప్ కోసం మొత్తం $11.25 మిలియన్ (సుమారు రూ. 93.51 కోట్లు) ప్రైజ్ మనీ ఫిక్స్ చేశారు.

READ MORE: Delhi: తాజ్ ఎక్స్‌ప్రెస్ లో మంటలు.. మూడు బోగీలు దగ్ధం

• విజేత: దాదాపు రూ. 20.36 కోట్లు
• రన్నరప్: రూ. 10.64 కోట్లు
• సెమీ-ఫైనల్: రూ. 6.54 కోట్లు
• రెండో రౌండ్‌లో ఔట్: రూ. 3.17 కోట్లు
• 9 నుంచి 12వ ర్యాంక్‌లో ఉన్న జట్లు: రూ. 2.05 కోట్లు
• జట్లు 13 నుంచి 20వ ర్యాంక్: రూ. 1.87 కోట్లు
• మొదటి, రెండవ రౌండ్‌లలో విజేతలు: రూ. 25.89 లక్షలు