T20 World Cup Final: టీ 20 ప్రపంచ కప్ రసవత్తర మెగా టోర్నీలో చివరిదైన టైటిల్ పోరు మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ఫీల్డింగ్ ఎంచుకోగా… పాకిస్తాన్ తన ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఎప్పటిమాదిరే కెప్టెన్ బాబర్ ఆజంతో కలిసి స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పాక్ ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. టైటిల్ విజేతను ఖరారు చేసే ఈ మ్యాచ్‌లో పాక్ బ్యాటర్లకు తొలి ఓవర్ వేసిన ఇంగ్లండ్ ఫేసర్ బెన్ స్టోక్స్ తొలి రెండు బంతుల్లోనే 2 పరుగులు ఇచ్చేశాడు. మెల్‌బోర్న్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఐదో ఓవర్‌లో సామ్ కరణ్ పాక్ కీలక ఆటగాడు మహమ్మద్ రిజ్వాన్‌ను 29 పరుగుల వద్ద ఔట్ చేశాడు. అనంతరం క్రీజులోకి మహమ్మద్ హారిస్ వచ్చాడు. కానీ హారిస్ కూడా ఎంతసేపు నిలబడలేదు. 7.1 ఓవర్ల వద్ద ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 49 పరుగుల వద్ద హారిస్ ఔటయ్యాడు. ఇరు జట్లు ఈ ప్రపంచ కప్‌ను గెలుచుకోవాలనే కసితో ఆడుతున్నాయి. శిఖరాగ్ర పోరులో ఇరు జట్లూ మారలేదు.
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్(w/c), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కరణ్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): బాబర్ ఆజం(సి), మహ్మద్ రిజ్వాన్(w), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది
