T20 World Cup 2026: 2026 టీ20 వరల్డ్ కప్ చుట్టూ ఉద్రిక్తత నెలకొంది. ఈ టోర్నీ భారత్‌లో జరగాల్సి ఉండగా.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు భారత్ రాదని ప్రకటించింది. జనవరి 22న జరిగిన అంతర్గత సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీబీ తెలిపింది. ఇప్పటికే వరల్డ్ కప్‌లో ఆడాలంటే భారత్‌కు రావాల్సిందేనని ఐసీసీ స్పష్టం చేసింది. కాగా, నిన్న (జనవరి 21న) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బీసీబీ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించగా, టోర్నీలో పాల్గొనకపోతే స్కాట్లాండ్‌ను ప్రత్యామ్నాయ జట్టుగా ఎంపిక చేస్తామని ఐసీసీ తేల్చి చెప్పింది.
READ MORE: Air India Loss: టాటా గ్రూప్‌కు ఎయిర్ ఇండియా షాక్.. ఏకంగా రూ.15 వేల కోట్ల భారీ నష్టం! రీజన్ ఇదే..
ఈ వివాదం మధ్య పాకిస్థాన్ ఊహించని ఎంట్రీ ఇచ్చింది. బంగ్లాదేశ్ టీం భారత్‌లో మ్యాచ్‌లను బహిష్కరిస్తే తామూ టోర్నీని బహిష్కరించే ఆలోచనలో ఉన్నామని పాకిస్థాన్ భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. పాకిస్థాన్ మీడియా కథనాల ప్రకారం.. “బంగ్లాదేశ్ ఈ టోర్నీకి దూరమైతే.. పాకిస్థాన్ బహిష్కరిస్తోంది” అనే చర్చ జరుగుతోందట. గతంలో భారత్ ఒత్తిడి కారణంగా పాకిస్థాన్ తమ హోం మ్యాచ్‌లను దుబాయ్‌కు మార్చాల్సి వచ్చింది. అప్పుడు ఆ కారణాన్ని ఐసీసీ అంగీకరించింది. కానీ అదే తరహా కారణాన్ని బంగ్లాదేశ్ చెప్పినప్పుడు మాత్రం అంగీకరించకపోవడం పాకిస్థాన్‌కు నిరాశ కలిగించిందని ఆ వర్గాలు అంటున్నాయి. మరోవైపు… పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వర్గాలను ఉటంకిస్తూ వచ్చిన మరో నివేదికలో పాక్ టోర్నీ నుంచి తప్పుకునే సమస్యే లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. బహిష్కరణ అన్న ఆలోచన ఎప్పుడూ లేదని ఆ నివేదిక వెల్లడించింది. ఏది ఏమైనప్పటికీ.. బంగ్లాదేశ్ చివరకు భారత్‌కు రానని స్పష్టం చేసిన నేపథ్యంలో పాకిస్థాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై చర్చ జరుగుతోంది.
READ MORE: Bangladesh Boycott: భారత్‌లో ఆడబోం.. టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరించిన బంగ్లాదేశ్..
https://www.yoursite.com/
