Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports T20 World Cup 2026 Bangladesh Out Pakistan Doubt Uganda Likely Replacement

T20 World Cup 2026: బంగ్లాదేశ్ ఔట్.. పాకిస్థాన్ డౌట్! పాక్ తప్పుకుంటే ఈ దేశానికి లక్కీ ఛాన్స్!

Published Date :January 25, 2026 , 9:05 am
By RAMAKRISHNA KENCHE
T20 World Cup 2026: బంగ్లాదేశ్ ఔట్.. పాకిస్థాన్ డౌట్! పాక్ తప్పుకుంటే ఈ దేశానికి లక్కీ ఛాన్స్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 చుట్టూ ఇప్పుడు కొత్త అనిశ్చితి మొదలైంది. ఇప్పటికే బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుంచి తప్పుకోవడంతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పుడు అదే బాటలో పాకిస్థాన్ కూడా టి20 వరల్డ్ కప్ ఆడకపోవచ్చన్న చర్చ మొదలవడం సంచలనంగా మారింది. బంగ్లాదేశ్‌లో చాలా రోజులుగా హిందువులు హత్యలు పెరుగుతున్నాయి. అక్కడి ప్రభుత్వం ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో భారత్‌లో ఉన్న హిందూ సమాజం ఆ దేశం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోభద్రతా కారణాలు చూపుతూ భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరించింది. దాంతో ఐసీసీ అధికారికంగా బంగ్లాదేశ్‌ను టోర్నమెంట్ నుంచి తప్పించి, దాని స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది. స్కాట్లాండ్‌ను గ్రూప్ Cలో ఉంచారు. ఆ గ్రూప్‌లో వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఇటలీ, నేపాల్ జట్లు ఉన్నాయి.

READ MORE: Ram-Pothineni : రామ్ పోతినేని షాకింగ్ నిర్ణయం..

బంగ్లాదేశ్ బయటపడిన తర్వాత పాకిస్థాన్ బహిరంగంగానే దానికి మద్దతు ప్రకటించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఐసీసీ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో ఆయన చేసిన మరో వ్యాఖ్య ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. పాకిస్థాన్ కూడా టి20 వరల్డ్ కప్‌లో ఆడాలా వద్దా అన్నది ఇంకా తేలలేదని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వానికి వదిలేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. “వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ ఆడాలా వద్దా అన్నది మా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఐసీసీ కాదు. ఈ విషయంలో మేము మా ప్రభుత్వ సూచనలకే కట్టుబడి ఉంటాం” అని చెప్పారు. ప్రస్తుతం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దేశంలో లేరని, తిరిగివచ్చిన తర్వాతే తుది నిర్ణయం తెలుస్తుందని నఖ్వీ తెలిపారు. ఈ మాటలతో పాకిస్థాన్ పాల్గొనడం ఇంకా అనిశ్చితిలోనే ఉందని స్పష్టమైంది.

READ MORE: Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన మాధురి- బయటపడిన అసలు బాగోతం

ఒకవేళ పాకిస్థాన్ నిజంగానే టోర్నమెంట్ నుంచి తప్పుకుంటే, అప్పుడు మరో జట్టుకు అవకాశం దక్కనుంది. అలా జరిగితే యుగాండా జట్టుకు ఈ అవకాశం రానుందని క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. యుగాండాను గ్రూప్ Aలో భారత్, నమీబియా, నెదర్లాండ్స్, అమెరికాతో కలిసి ఉంచే అవకాశం ఉంది. యుగాండా గతంలో వెస్టిండీస్, అమెరికాలో జరిగిన టి20 వరల్డ్ కప్‌లో పాల్గొంది. కానీ గ్రూప్ దశ దాటలేకపోయింది. అయినప్పటికీ, ఐసీసీ సాధారణంగా ర్యాంకింగ్స్ ఆధారంగా ప్రత్యామ్నాయ జట్టును ఎంపిక చేస్తుంది. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకోవడానికి కూడా ఇదే కారణం. ప్రస్తుతం స్కాట్లాండ్ టి20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉంది. యుగాండా మాత్రం 21వ స్థానంలో ఉంది. పాపువా న్యూగినీ కంటే యుగాండా ముందుండటంతో, పాకిస్థాన్ తప్పుకుంటే యుగాండాకు అవకాశం రావచ్చని అంచనా.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bangladesh out of T20 World Cup
  • cricket world cup controversy
  • ICC Bangladesh removal
  • ICC rankings replacement team
  • Pakistan cricket board statement

తాజావార్తలు

  • Aloo Roti Recipe: ఆలూ రోటీ ఇలా ప్రయత్నించండి.. పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుంటూ తింటారు..

  • TG Parent Care Bill 2026: నేడే బిల్లు.. ఇక తల్లిదండ్రులను చూసుకోకపోతే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల జీతాల్లో కోతలు పక్కా..

  • Hardik Pandya: యాటిట్యూడ్ మాత్రమే కాదు.. మంచి మనసు ఉందని నిరూపించిన హార్దిక్ పాండ్య..!

  • Varanasi: రెండు భాగాలుగా ‘వారణాసి’.. జక్కన్న రియాక్షన్ ఇదే!

  • Amaravati Legal Status: అమరావతికి చట్టబద్ధత.. నేడే ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..

ట్రెండింగ్‌

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

  • Natural Remedy : మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం.. ఇంట్లోనే రెడీ చేసుకోండి ఈ ‘మ్యాజికల్ డ్రింక్’

  • Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో TECNO Spark 50 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions