T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 చుట్టూ ఇప్పుడు కొత్త అనిశ్చితి మొదలైంది. ఇప్పటికే బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుంచి తప్పుకోవడంతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పుడు అదే బాటలో పాకిస్థాన్ కూడా టి20 వరల్డ్ కప్ ఆడకపోవచ్చన్న చర్చ మొదలవడం సంచలనంగా మారింది. బంగ్లాదేశ్‌లో చాలా రోజులుగా హిందువులు హత్యలు పెరుగుతున్నాయి. అక్కడి ప్రభుత్వం ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో భారత్‌లో ఉన్న హిందూ సమాజం ఆ దేశం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోభద్రతా కారణాలు చూపుతూ భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరించింది. దాంతో ఐసీసీ అధికారికంగా బంగ్లాదేశ్‌ను టోర్నమెంట్ నుంచి తప్పించి, దాని స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది. స్కాట్లాండ్‌ను గ్రూప్ Cలో ఉంచారు. ఆ గ్రూప్‌లో వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఇటలీ, నేపాల్ జట్లు ఉన్నాయి.
READ MORE: Ram-Pothineni : రామ్ పోతినేని షాకింగ్ నిర్ణయం..
బంగ్లాదేశ్ బయటపడిన తర్వాత పాకిస్థాన్ బహిరంగంగానే దానికి మద్దతు ప్రకటించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఐసీసీ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో ఆయన చేసిన మరో వ్యాఖ్య ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. పాకిస్థాన్ కూడా టి20 వరల్డ్ కప్‌లో ఆడాలా వద్దా అన్నది ఇంకా తేలలేదని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వానికి వదిలేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. “వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ ఆడాలా వద్దా అన్నది మా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఐసీసీ కాదు. ఈ విషయంలో మేము మా ప్రభుత్వ సూచనలకే కట్టుబడి ఉంటాం” అని చెప్పారు. ప్రస్తుతం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దేశంలో లేరని, తిరిగివచ్చిన తర్వాతే తుది నిర్ణయం తెలుస్తుందని నఖ్వీ తెలిపారు. ఈ మాటలతో పాకిస్థాన్ పాల్గొనడం ఇంకా అనిశ్చితిలోనే ఉందని స్పష్టమైంది.
READ MORE: Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన మాధురి- బయటపడిన అసలు బాగోతం
ఒకవేళ పాకిస్థాన్ నిజంగానే టోర్నమెంట్ నుంచి తప్పుకుంటే, అప్పుడు మరో జట్టుకు అవకాశం దక్కనుంది. అలా జరిగితే యుగాండా జట్టుకు ఈ అవకాశం రానుందని క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. యుగాండాను గ్రూప్ Aలో భారత్, నమీబియా, నెదర్లాండ్స్, అమెరికాతో కలిసి ఉంచే అవకాశం ఉంది. యుగాండా గతంలో వెస్టిండీస్, అమెరికాలో జరిగిన టి20 వరల్డ్ కప్‌లో పాల్గొంది. కానీ గ్రూప్ దశ దాటలేకపోయింది. అయినప్పటికీ, ఐసీసీ సాధారణంగా ర్యాంకింగ్స్ ఆధారంగా ప్రత్యామ్నాయ జట్టును ఎంపిక చేస్తుంది. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకోవడానికి కూడా ఇదే కారణం. ప్రస్తుతం స్కాట్లాండ్ టి20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉంది. యుగాండా మాత్రం 21వ స్థానంలో ఉంది. పాపువా న్యూగినీ కంటే యుగాండా ముందుండటంతో, పాకిస్థాన్ తప్పుకుంటే యుగాండాకు అవకాశం రావచ్చని అంచనా.
