NTV Telugu Site icon

T20 World Cup 2024: అందరూ మహిళలే.. టీ20 ప్రపంచకప్‌ అంపైర్ల లిస్ట్ ఇదే! ఏపీ నుంచి ఒకరు

T20 World Cup 2024 Umpires

T20 World Cup 2024 Umpires

T20 World Cup 2024 Female Panel of Match Officials: అక్టోబరు 3 నుంచి 20 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో మహిళల టీ20 ప్రపంచకప్‌ 2024 జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. టీ20 ప్రపంచకప్‌ కోసం అంపైర్ల ప్యానెల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. టోర్నీ కోసం 10 మంది అంపైర్లు, ముగ్గురు రిఫరీలను ఐసీసీ అధికారులు నియమించారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. అందరూ మహిళా అంపైర్లే.

టీ20 ప్రపంచకప్‌ 2024 కోసం ఎంపికైన అంపైర్లలో క్లెయిర్‌ పొలోసక్‌ అత్యంత అనుభవజ్ఞురాలు. గత నాలుగు మహిళల టీ20 ప్రపంచకప్‌లలో ఆమె విధులు నిర్వర్తించారు. జాక్వెలిన్‌ విలియమ్స్‌, కిమ్‌ కాటన్‌లకు ఇది నాలుగో టీ20 ప్రపంచకప్‌. కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన 2023 ఫైనల్‌కు విలియమ్స్, కాటన్ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించారు. భారత్‌ నుంచి వృంద రాఠీ అంపైర్‌గా, గండికోట సర్వ లక్ష్మి రిఫరీగా వ్యవహరించనున్నారు. ఏపీకి చెందిన లక్ష్మి.. 2023 ప్రపంచకప్‌ ఫైనల్‌కు రిఫరీగా వ్యవహరించారు.

ఫుల్ లిస్ట్ ఇదే:
అంపైర్లు: లారెన్‌ ఏజ్‌బ్యాగ్, కిమ్‌ కాటన్, దంబనెవన, అనా హారిస్, నిమాలి పెరీరా, క్లెయిర్‌ పొలోసాక్, వృంద రాఠీ, రెడ్‌ఫెర్న్, షెరిడాన్, జాక్వెలియన్‌ విలియమ్స్‌.
రిఫరీలు: షాండ్రీ ఫ్రిట్జ్, జీఎస్‌ లక్ష్మి, మిషెల్‌ పెరీరా.