Site icon NTV Telugu

సన్‌రైజర్స్‌ జట్టులో కరోనా కలకలం..ఓ ఆటగాడికి పాజిటివ్‌

ఐపీఎల్‌ 2021 టోర్నీని కరోనా మహమ్మారి వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా ఏప్రిల్‌ మాసం జరగాల్సిన ఐపీఎల్‌ 2021 టోర్నీ… వాయిదా పడింది. కరోనా తగ్గిన నేపథ్యం లో దుబాయ్‌ లో పునః ప్రారంభం అయిన ఈ ఐపీఎల్‌ 2021 టోర్నీ ని… ఇక్కడి కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. తాజాగా చేసిన కరోనా పరీక్షల్లో సన్‌రైజర్స్‌ జట్టు ఆటగాడు నటరాజన్‌ కు పాజిటివ్‌ గా నిర్ధారణ అయినట్లు సమాచారం అందుతోంది.

అయితే.. నటరాజన్‌ పేరు అధికారికంగా వెల్లడించలేదు సన్‌ రైజర్స్‌ యాజమాన్యం. ప్రస్తుతం నటరాజన్‌ ఐసోలేషన్‌ లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు… నటరాజన్‌ తో పాటు సన్నిహితంగా ఉన్న మరో ఆరుగురు ఆటగాళ్లను కూడా హోం ఐసోలేషన్‌కు పంపినట్లు తెలుస్తోంది. కాగా… ఇవాళ సాయంత్రం 7.30 ఢిల్లీ కాపిటల్స్‌ మరియు సన్‌ రైజర్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనున్న విషయం తెలిసిందే.

Exit mobile version