Site icon NTV Telugu

T.Congress : ఢిల్లీలో టీకాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం

T Congress

T Congress

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. మరో వారం రోజుల్లోగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఈ క్రమంలో ఆయా పార్టీలు మేనిఫెస్టోలను సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో బరిలోకి దించే అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఇదే క్రమంలో పార్టీ నుంచి బీ ఫాం ఆశించి భగ్గపడ్డ నేతలకు సముచిత స్థానం కల్పించేందుకు కసరత్తు చేస్తున్నాయి. అయితే.. ఇప్పటికే బీఆర్‌ఎసల్ 119 స్థానాలకు 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్‌ సైతం అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు మరోసారి టీ కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ ఢిల్లీలో భేటీ కానుంది.

Also Read : IND Vs AUS: ఈ ఐదుగురు చాలు భారత్ ను ఓడించడానికి.. మనోళ్లు జాగ్రత్తగా ఉండాల్సిందే

అయితే.. తమకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ అశావహులు ఏఐసీసీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అధిష్టానం పెద్దల ఇళ్ల వద్ద టికెట్ల కోసం పడిగాపులు కాస్తున్నారు ఆశావాహులు. పెద్దలను కలిసి పైరవీలు చేస్తే తప్పా.. టికెట్లు ఖరారు కావన్న భావనతో కొందరు నేతలు.. ఢిల్లీ పెద్దలను కలిసి ప్రసన్నం చేసుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఏఐసీసీ కార్యాలయం దగ్గర జగ్గా రెడ్డి, కుసుమ కుమార్ వంటి సీనియర్ నేతలు కనిపించగా.. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కె. మురళీధరన్ నివాసం వద్ద ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఆశావహులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆయన్ను కలిసి వెళ్లారు. మురళీధరన్‌ను కలిసినవారిలో సునీత రావు, శివసేన రెడ్డి, అద్దంకి దయాకర్, మాధవి రెడ్డి, రాధిక, ప్రమోద్ కుమార్, మైలారం సులోచన సహా పలువురు ఉన్నారు.

OMG 2: అనుకున్న సమయం కంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చిన అక్షయ్ కుమార్ ‘ఓఎంజీ 2’ సినిమా.

Exit mobile version