NTV Telugu Site icon

Swiggy Instamart: ఇదేందీ ఇది.. ఎప్పుడూ సూడలే..లెటర్ చూస్తే నవ్వాగదు..

Swi

Swi

మనం ఒక కంపెనీ లో పనిచేస్తున్న సమయంలో ఆ కంపెనీకి తగ్గట్లు రూల్స్ ను ఫాలో అవ్వాల్సిందే.. ఒకవేళ అక్కడ రూల్స్ నచ్చకుంటే జాబ్ కు రిజైన్ చేస్తారు.. ఇప్పటివరకు అందరు రాత పూర్వకంగా లెటర్ రాస్తే.. స్విగ్గి మాత్రం వింతగా లెటర్ ను రాసి అందరిని ఆశ్చర్యానికి గురి చెయ్యడం మాత్రమే అందరిని కడుపుబ్బా నవ్వించారు . ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

పనిప్రదేశంలో కూడా వినోదానికి పెద్దపీట వేస్తూ ఉపాధి పొందుతున్నారు. చేసే ప్రతిపనిలో వినోదం వికసించేలా ముందుకు సాగుతున్న ఎన్నో కథలు పలుమార్లు నెట్టింట వైరల్ అయ్యాయి. కానీ ఈ సారి మాత్రం ఇదే తరహాలో ఒక రాజీనామా లేఖ వైరల్ అవుతోంది. ఉద్యోగం చేయడంలోనే కాదు.. చివరికి ఉద్యోగానికి రాజీనామా చేసే విషయంలోనూ తగ్గేదే లేదంటూ దానికి కూడా వినోదాన్ని జోడిస్తున్నారు. తాజాగా Swiggy Instamart అత్యంత విచిత్రమైన రీతిలో రాజీనామా లేఖను రూపొందించి, దానిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది..

సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆ లెటర్ లో ఇన్‌స్టామార్ట్‌లో లభ్యమయ్యే అన్ని స్నాక్ ఐటమ్స్‌ను ఉపయోగించి ఈ రాజీనామా లేఖను తయారు చేసింది. దీనిని చూసినవారెవరూ నవ్వకుండా ఉండలేరు. ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్టుపై విభిన్న కామెంట్లు వస్తున్నాయి. ఔరా రాజీనామా లేఖ కూడా ఇలా ఉంటుందా? అని కొంతమంది కామెంట్ చేయగా, మరికొంత మంది రాజీనామా లాంటి సీరియస్ విషయంలో ఇదేంటని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా అయితే, నెటిజన్ల నుంచి కామెంట్స్, లైకులు, షేర్స్ తో పాటు ప్రశంసలు అందుకుంటుంది.. ఇలాంటి చూడటం నిజంగా ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ లెటర్ ను చూసి కాసేపు హాయిగా నవ్వేసుకోండి..

Show comments