NTV Telugu Site icon

Swayambhu : మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కోసం వియత్నాం కు వెళ్లిన నిఖిల్..

Whatsapp Image 2023 09 07 At 1.07.45 Pm

Whatsapp Image 2023 09 07 At 1.07.45 Pm

యంగ్ హీరో నిఖిల్ గత ఏడాది కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత చేసిన యాక్షన్ థ్రిల్లర్ స్పై మూవీ అంతగా ఆకట్టుకోలేదు. దీనితో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యాడు నిఖిల్ . ఇటీవల కాలంలో తన సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో మెప్పిస్తున్న నిఖిల్ ఈసారి భారీ స్థాయి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.ఇప్పటికే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సమర్పణలో ది ఇండియా హౌస్ టైటిల్ తో ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తున్నాడు హీరో నిఖిల్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలవకుండానే అంతలోనే స్వయంభూ అనే మరో సినిమాను స్టార్ట్ చేసాడు. భరత్ కృష్ణమాచారి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ను పెడుతున్నట్టు ఇంతకు ముందు మూవీ టీం పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

నిఖిల్ ఆ పోస్టర్ లో వారియర్ గెటప్ లో కనిపిస్తున్నాడు. పోస్టర్ లో డ్రాగన్ పైకి బాణం వేస్తూ నిఖిల్ ఉండటం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుంది. కాగా టైటిల్ ఆర్ట్ లో కూడా ఇదే డ్రాగన్ హైలెట్ అవుతుంది. దీనిబట్టి చూస్తే హిస్టరీ తో ముడిపడిన మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండనుంది. ఠాగూర్ మధు సమర్పణలో రాబోతున్నఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో లక్కీ హీరోయిన్ సంయుక్త మీనన్ నిఖిల్  సరసన హీరోయిన్ గా నటిస్తోంది కేజీఎఫ్ ఫేం రవి బసుర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే బింబిసార ఫేం వాసుదేవ్ మున్నెప్పగిరి ఈ సినిమాకు డైలాగ్స్ అందించనున్నారు. స్వయంభు సినిమా దాదాపు స్టార్ టెక్నీషియన్స్ తో రూపుదిద్దుకుంటుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్,ఆయుధాల వాడకం పై ట్రైనింగ్ కు నిఖిల్ వియత్నాం వెళ్లారు.అక్కడ ప్రముఖ స్టంట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు శిక్షణ తీసుకోనున్నారు.దీనితో ఎయిర్ పోర్ట్ కు బయలు దేరుతున్న వీడియో నిఖిల్ పోస్ట్ చేసారు.

https://twitter.com/actor_Nikhil/status/1699638700022337982?s=20