Swayambhu : మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కోసం వియత్నాం కు వెళ్లిన నిఖిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో నిఖిల్ గత ఏడాది కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత చేసిన యాక్షన్ థ్రిల్లర్ స్పై మూవీ అంతగా ఆకట్టుకోలేదు. దీనితో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యాడు నిఖిల్ . ఇటీవల కాలంలో తన సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో మెప్పిస్తున్న నిఖిల్ ఈసారి భారీ స్థాయి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.ఇప్పటికే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సమర్పణలో ది ఇండియా హౌస్ టైటిల్ తో ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తున్నాడు హీరో నిఖిల్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలవకుండానే అంతలోనే స్వయంభూ అనే మరో సినిమాను స్టార్ట్ చేసాడు. భరత్ కృష్ణమాచారి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ను పెడుతున్నట్టు ఇంతకు ముందు మూవీ టీం పోస్టర్ ను కూడా విడుదల చేసింది.
నిఖిల్ ఆ పోస్టర్ లో వారియర్ గెటప్ లో కనిపిస్తున్నాడు. పోస్టర్ లో డ్రాగన్ పైకి బాణం వేస్తూ నిఖిల్ ఉండటం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుంది. కాగా టైటిల్ ఆర్ట్ లో కూడా ఇదే డ్రాగన్ హైలెట్ అవుతుంది. దీనిబట్టి చూస్తే హిస్టరీ తో ముడిపడిన మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండనుంది. ఠాగూర్ మధు సమర్పణలో రాబోతున్నఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో లక్కీ హీరోయిన్ సంయుక్త మీనన్ నిఖిల్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది కేజీఎఫ్ ఫేం రవి బసుర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే బింబిసార ఫేం వాసుదేవ్ మున్నెప్పగిరి ఈ సినిమాకు డైలాగ్స్ అందించనున్నారు. స్వయంభు సినిమా దాదాపు స్టార్ టెక్నీషియన్స్ తో రూపుదిద్దుకుంటుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్,ఆయుధాల వాడకం పై ట్రైనింగ్ కు నిఖిల్ వియత్నాం వెళ్లారు.అక్కడ ప్రముఖ స్టంట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు శిక్షణ తీసుకోనున్నారు.దీనితో ఎయిర్ పోర్ట్ కు బయలు దేరుతున్న వీడియో నిఖిల్ పోస్ట్ చేసారు.
Also Read
https://twitter.com/actor_Nikhil/status/1699638700022337982?s=20
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?