NTV Telugu Site icon

Swati maliwal: పాలిగ్రాఫ్ టెస్ట్‌ కోసం పోలీసులకు రిక్వెస్ట్.. కారణమిదే!

Swayhi

Swayhi

ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ మరో సాహసానికి పూనుకున్నారు. తన ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ కొట్టిపారేస్తున్న నేపథ్యంలో ఆమె పాలిగ్రాఫ్ పరీక్షకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆమె పోలీసులను అభ్యర్థించారు. తనకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది.

ఇదిలా ఉంటే మే 13న ముఖ్యమంత్రి నివాసంలో స్వాతి మాలివాల్‌పై కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌ భౌతికదాడికి తెగబడ్డారు. అయితే దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుటి వరకు ఒక్కటి కూడా బయటకు రాలేదు. కానీ సెలెక్టివ్‌ వీడియోలను మాత్రం ఆప్ విడుదల చేసింది. అందులో స్వాతి మాలివాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విజువల్స్ మాత్రమే విడుదల చేశారు. కానీ డ్రాయింగ్ రూమ్‌లో ఏం జరిగిందో అన్న విషయం మాత్రం బయటకు రాలేదు. బాధితురాలైన తనపై ఆప్ నిందలు మోపడం బాధ కలిగిస్తోందని స్వాతి మాలివాల్ ఆవేదన చెందారు.

దాడి జరిగిన తర్వాత కేజ్రీవాల్ ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు తన బట్టలు చిరిగిపోలేదని ఆప్ మంత్రి చెబుతున్నారని.. ఎప్పుడూ కూడా బాధితురాలిపైనే నిందలు మోపుతారని.. నిర్భయ విషయంలో కూడా ఇదే జరిగిందని స్వాతి మాలివాల్ వాపోయారు. అందుకోసమే తనకు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించాలని పోలీసులను కోరుతున్నట్లు స్వాతి మాలివాల్ పేర్కొన్నారు.

మే 13న కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మాలివాల్‌పై బిభవ్ కుమార్ దాడికి తెగబడ్డారు. ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత బిభవ్ కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇక మొబైల్ ఉన్న డేటా డిలీట్ చేయడంతో ఇటీవల బిభవ్ కుమార్‌ను పోలీసులు ముంబైకి తీసుకెళ్లారు. ఇక స్వాతి మాలివాల్ తనపై ఎక్కడెక్కడ దాడి జరిగిందో.. అవన్నీ పోలీసులు ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. ఇక ఈ ఘటనను బీజేపీ తీవ్రంగా ఖంచింది. కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు.