Site icon NTV Telugu

AHA: ద‌స‌రాకు రిలీజైన‌ సినిమా దీపావ‌ళి కాగానే ఓటీటీలో…

Swathimutyam

Swathimutyam

AHA: ద‌స‌రా కానుక‌గా ఈ నెల 5న విడుద‌లైంది ‘స్వాతిముత్యం’ సినిమా! చిరంజీవి ‘గాడ్ ఫాద‌ర్’, నాగార్జున ‘ది ఘోస్ట్’ తో పోటీప‌డిన ‘స్వాతిముత్యం’కు కంటెంట్ ప‌రంగా మంచి పేరే వ‌చ్చింది. కానీ కాసుల వ‌ర్షం కురిపించ‌డంలో ఈ సినిమా విఫ‌ల‌మైంది. ప్ర‌ముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ త‌న‌యుడు గ‌ణేశ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీలో వ‌ర్ష బొల్ల‌మ్మ నాయిక‌గా న‌టించింది. ల‌క్ష్మ‌ణ్ కె కృష్ణ ఈ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు.

Allu Sirish: ఆ అమ్మాయితో రిలేషన్.. నోరు విప్పిన అల్లువారబ్బాయి

‘విక్కీ డోన‌ర్’ త‌ర‌హాలో స్పెర్మ్ డోనేట్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా క్యారెక్ట‌ర్స్ ఆర్టిస్టుల కార‌ణంగా వినోదాల విందును వ‌డ్డించింది. నిజానికి విడుద‌ల స‌మ‌యంలోనే ఇది థియేట‌ర్ల‌లో కంటే ఓటీటీలో మంచి ఆద‌ర‌ణ పొందుతుంద‌ని కొంద‌రు తెలిపారు. బ‌హుశా అందుకే కావ‌చ్చు… ఈ సినిమాను దీపావ‌ళి వెళ్ళ‌గానే వ‌స్తున్న‌ శుక్ర‌వారం అంటే 24వ తేదీన ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయ‌బోతున్నారు. సో… ‘స్వాతిముత్యం’ను థియేట‌ర్ల‌లో మిస్ అయిన‌ వారికి సూప‌ర్ ఛాన్స్ త్వ‌ర‌గానే ద‌క్కింద‌ని అనుకోవాలి.

Exit mobile version