Site icon NTV Telugu

Swallows Set of Teeth : నిద్రలో ప‌ళ్ల సెట్ మింగేసిన వ్యక్తి.. ఆ తరువాత..!

Teeth

Teeth

Swallows Set of Teeth : విశాఖపట్నంలోని ఒక వ్యక్తి పళ్ల సెట్ మింగడంతో ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయింది. 52 సంవత్సరాల వయస్సున్న ఈ వ్యక్తి రెండు సంవత్సరాల క్రితం తనకు కృత్రిమ పళ్ల సెట్ అమర్చుకున్నాడు. సెట్ అటు ఇటు ఊడిపోతుండడంతో, నిద్రలో ఉన్నప్పుడు అది ఊడిపోయి, తెలియకుండానే ఆయన దాన్ని మింగేసి ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయింది.

పళ్ల సెట్ కుడి ఊపిరితిత్తి మధ్య భాగంలో ఇరుక్కుంది. అయితే ఎడమ ఊపిరితిత్తి సహజంగా పనిచేస్తుండటంతో శ్వాసకోణంలో ఎలాంటి సమస్యలు రాలేదు. కానీ, అది అలా ఉండటం వల్ల లోపలి భాగంలో ఇన్ఫెక్షన్ ఏర్పడే ప్రమాదం ఉన్నది. కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో డాక్టర్ సీహెచ్ భరత్, పేషెంట్‌కు ఎక్స్-రే, సీటీ స్కాన్ చేసి కుడి ఊపిరితిత్తిలో పళ్ల సెట్ ఉందని గుర్తించారు.

Instagram Love : యువతి కొంపముంచిన ఇన్ స్టాగ్రామ్ పరిచయం

అప్పుడు డాక్టర్లు రిజిడ్ బ్రాంకోస్కోపీ పరికరంతో సరిగా జాగ్రత్తగా ఆ పళ్ల సెట్‌ను బయటకి తీసి, పేషెంట్‌కి ఇబ్బంది లేకుండా చికిత్స ఇచ్చారు. ఈ ప్రక్రియలో, లోహపదార్థాల కారణంగా ఊపిరితిత్తులకు గాయం కావడంతో జాగ్రత్తగా తీసినట్లు వారు తెలిపారు. అదృష్టవశాత్తు చిన్న గాయం జరిగి, వెంటనే సరిచేయడంతో పేషెంట్‌ని పూర్తిగా కోలుకున్నారు.

డాక్టర్ భరత్ మాట్లాడుతూ.. “పళ్ల సెట్ కట్టించుకున్న వారు దంత వైద్యులను అనుసరిస్తూ, ఎప్పటికప్పుడు తనిఖీ చేయించుకోవాలి. ఈ విధంగా నిర్లక్ష్యంగా ఉండటం శరీరంలోని ఇతర భాగాలకు హానికరం కావచ్చు. కృతిమ పళ్ల సెట్‌ను సరిగ్గా ఉంచకుండా ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంటే, దాని చుట్టూ కండలు పెరిగే ప్రమాదం ఉంటుంది.” అని తెలిపారు.

Wife Murdered Husband: పెళ్లయిన నాలుగు రోజులకే భర్తను హత్య చేసిన భార్య.. అసలెందుకు ఇలా

Exit mobile version