NTV Telugu Site icon

Swag : దయచేసి.. రివీల్‌ చేయొద్దు…ప్రేక్షకులకు శ్రీవిష్ణు రిక్వెస్ట్‌

Swag Movie

Swag Movie

Swag : గతేడాది ‘సామజవరగమన’, ‘ఓం భీమ్‌ బుష్‌’ సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న హీరో శ్రీవిష్ణు ఈ రోజు ‘శ్వాగ్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాజ రాజ చోర సినిమాకు దర్శకత్వం వహించిన హసిత్ గోలి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ లో టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ అయింది. యూఎస్‌ లో ఒక రోజు ముందే ప్రీమియర్‌ షో లు పడ్డాయి. సినిమా పై చాలా నమ్మకంతో మేకర్స్‌ ప్రీమియర్ షో లకు సిద్ధం అయ్యారు. సినిమాలో ఉండే ట్విస్ట్‌లు ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేయడం మాత్రమే కాకుండా అవుట్ అండ్ అవుట్ కామెడీని పండిస్తాయని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.

Read Also:Mohan Raj : ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటులో ఫేమస్ విలన్ కన్నుమూత

ఇక సినిమా ప్రమోషన్‌లో భాగంగా హీరో శ్రీవిష్ణు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… శ్వాగ్‌ చాలా డిఫరెంట్ సినిమా, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఒక మంచి వినోదాత్మక సినిమాగా శ్వాగ్‌ ఉంటుంది. ఈ సినిమాలో చాలా ట్విస్ట్‌ లు ఉన్నాయి. సినిమాను చూసిన వాళ్లెవరూ కూడా దయచేసి ట్విస్ట్‌ లను సోషల్‌ మీడియా ద్వారా లేదా మరెక్కడైనా రివీల్‌ చేయవద్దంటూ విజ్ఞప్తి చేశారు. యూఎస్ లో ప్రీమియర్‌ షో ల నేపథ్యంలో హీరో శ్రీ విష్ణు ఈ విధంగా విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసిన ప్రేక్షకులు ఏ ఒక్కరూ ట్విస్ట్‌లను రివీల్‌ చేయవద్దంటూ హీరో శ్రీవిష్ణు విజ్ఞప్తి చేయడం జరిగింది.

Read Also:Tollywood : కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రభాస్, రామ్ చరణ్, విజయశాంతి రియాక్షన్

ఇటీవల కాలంలో చిన్న సినిమాలకు మంచి స్పందన వస్తున్న విషయం తెల్సిందే. చిన్న సినిమాలు పెద్ద సినిమాల స్థాయిలో వసూళ్లు దక్కించుకుంటున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కనుక ఈ సినిమా కచ్చితంగా మంచి కాన్సెప్ట్‌ తో వస్తుంది కనుక బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు నమ్మకంగా చెబుతున్నారు. శ్వాగ్‌ చిత్రంలో శ్రీవిష్ణు నాలుగు డిఫరెంట్ రోల్స్ లో కనిపించనున్నారు. అందులో సింగ పాత్ర చాలా స్పెషల్‌ గా ఉంటుందని, ప్రతి ఒక్కరు చూడగానే నవ్వుకునే విధంగా ఉంటుందని మేకర్స్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే నటన విషయంలో పలుసార్లు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న శ్రీవిష్ణు శ్వాగ్‌ లో అంతకు మించి అన్నట్లుగా నటన ఉంటుందని, అంతే కాకుండా శ్వాగ్‌ లో శ్రీవిష్ణు నటన పరంగా కెరీర్‌ ది బెస్ట్‌ ఇచ్చినట్లు మేకర్స్ చెప్పారు.

Show comments