SVSN Varma: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత.. డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక, ఈ కార్యక్రమానికి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత వర్మ హాజరయ్యారు.. బాధ్యతలు స్వీకరించిన జనసేనాని పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. పవన్ కల్యాణ్‌ను డిప్యూటీ సీఎంగా చూడటంతో నా జన్మ ధన్యమైందన్నారు. పిఠాపురం ప్రజలు గెలిపించుకున్న పవన్ కల్యాణ్.. ఈ పదవిలో ఉండటం ద్వారా రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తారని తెలిపారు. ఇక, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయంలో ధ్వంసమైన వ్యవస్థలను పవన్ కల్యాణ్ గాడిలో పెట్టేందుకు
రివ్యూలు చేస్తున్నారు.. త్వరలోనే క్షేత్రస్థాయి పర్యటనతో పాటు పిఠాపురం పర్యటన కూడా ఉంటుందన్నారు.. మరోవైపు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రామ లక్ష్మణుల మాదిరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పని చేస్తారని వ్యాఖ్యానించారు తెలుగుదేశం పార్టీ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ..
SVSN Varma: బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వర్మ
- ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్
- పవన్ కల్యాణ్‌ను డిప్యూటీ సీఎంగా చూడటంతో నా జన్మ ధన్యమైందన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే
- గత ప్రభుత్వ హయంలో ధ్వంసమైన వ్యవస్థలను పవన్ గాడిలో పెడతారన్న వర్మ
- చంద్రబాబు.. పవన్ కల్యాణ్.. రామ లక్ష్మణుల మాదిరి రాష్ట్రం కోసం పని చేస్తారన్న టీడీపీ నేత

Varma