violence in Mominpur: పశ్చిమ బెంగాల్‌లోని మోమిన్‌పూర్‌లో హింసాకాండ తర్వాత కేంద్ర బలగాలను అత్యవసరంగా మోహరించాలని బీజేపీ నేత సువేందు అధికారి హోంమంత్రి అమిత్ షాకు, గవర్నర్ లా గణేషన్‌కు లేఖ రాశారు. ఈ క్రమంలో నిరసనకారులు ఎక్బల్‌పూర్ పోలీస్‌స్టేషన్‌ను దోచుకున్నారని.. ఈ నేపథ్యంలో అల్లర్లను పోలీసులు అదుపు చేయలేకపోతున్నారని లేఖలో తెలిపారు. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో మరో అల్లర్లు చెలరేగే అవకాశం ఉందన్నారు. దీంతో శాంతభద్రతలను కాపాడేందుకు పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర బలగాలను మోహరించాలని కోరుతూ బీజేపీ నేత సువేందు అధికారి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు.
mulayam singh yadav: ములాయంకు ప్రధాని మోడీ సహా ప్రముఖుల సంతాపం
కోల్‌కతాలోని ఖిదిర్‌పూర్, మోమిన్‌పూర్ ప్రాంతంలో లక్ష్మీ పూజ సందర్భంగా హిందూ సమాజంపై దాడి జరిగిందని ప్రతిపక్ష నేత అధికారి లేఖలో పేర్కొన్నారు. హింసలో హిందువులకు చెందిన అనేక దుకాణాలు, బైక్‌లను పోకిరీలు, సంఘ వ్యతిరేకులు ధ్వంసం చేశారని ఆయన అన్నారు. హౌరా జిల్లాలోని ఉలుబెరియా ప్రాంతంలో జూన్‌లో జరిగిన పంచ్లా హింసాకాండకు ఈ దాడికి సారూప్యతలు ఉన్నాయి. ఆ సమయంలో, హింస పశ్చిమ బెంగాల్ అంతటా, ముఖ్యంగా నాడియా, ముర్షిదాబాద్ జిల్లాల్లో వ్యాపించిందని అధికారి రాశారు. బెంగాల్‌లోని మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం హింసకు పాల్పడే వారి ముందు ప్రభుత్వం మెల్లిగా లొంగిపోయిందని సువేందు అధికారి అన్నారు. ఎక్బల్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను కొందరు దుర్మార్గులు స్వాధీనం చేసుకున్నారని కూడా ఆయన పేర్కొన్నారు.