Driving Skills: ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అది గుర్తించగలిగితే ఆ రంగంలో ఉన్నతస్థాయికి ఎదగవచ్చు. ఎంతో మంది తమ టాలెంట్ ను తాము గుర్తించుకోలేక.. అలా మట్టిలో మాణిక్యాల్లాగే మిగిలిపోతుంటారు. మరికొంత మందికి టైం కాస్త అటుఇటైనా వారి టాలెంట్ బయటపడి పాపులర్ అయిపోతున్నారు. ఈ మధ్య సోషల్ మీడియా పుణ్యమాని చావబోవు వయసులో కూడా కొందరు వేరీ పాపులర్ అయిపోతున్నారు. అలాంటిదే ఇక్కడ ఓ డ్రైవర్ ఇరుగ్గా ఉన్న వంతెనపై కారును డ్రైవింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక్కడ వింతేమిటంటే కారుకు చిన్న స్క్రాచ్ పడకుండా నడిపి అబ్బురపరిచాడు.
Read Also: Uorfi Javed: నిజాన్ని ఒప్పుకున్న ఉర్ఫీ జావేద్.. పాపులారిటీ కోసమే ఇదంతా
వైరల్ వీడియో ప్రకారం.. అదొక ఇరుకైన వంతెన.. ఒకే సారి అక్కడికి ఎదురెదురుగా రెండు కార్లు వచ్చాయి. ఆ రోడ్డు గుండా రెండు కార్లు వెళ్లే అవకాశం లేదు. వెనక్కి మళ్లలేవు. అందుకే తనకు ఎదురుగా వచ్చిన తెలుపు కారుకు ఛాన్స్ ఇచ్చి.. ఈ నీలం కారు డ్రైవర్ ఏకంగా తన వాహనాన్ని ఆ రోడ్డు పక్కన ఉన్న గోడపైకి ఎక్కించి వినూత్నంగా నడుపుతాడు. ఎక్కడా కూడా తెలుపు రంగు కారుకు టచ్ కాకుండా ముందుకు తీసుకెళతాడు. అతడు కారు నడిపిన విధానం ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
Insane driving skills pic.twitter.com/wfwSd8uW9m
— Next Level Skills (@NextSkillslevel) January 16, 2023