హైదరాబాద్ లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కనకదుర్గ వైన్స్ షాప్ లో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కనకదుర్గ వైన్స్ లో మద్యం సేవించడానికి వచ్చిన నాగి అనే వ్యక్తి.. మద్యం సేవించి షాప్ లోనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. షాప్ సిబ్బంది కాళ్లు, చేతులు పట్టి రోడ్డుపై పడేశారు.. దీంతో సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.
Read Also: President Murmu: హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి.. స్వాగతం పలికిన సీఎం కేసీఆర్
తన భర్త మృతికి షాప్ సిబ్బంది, యాజమాన్యమే కారణమంటూ మృతుడి భార్య మృతదేహాంతో వైన్స్ ముందు అర్ధరాత్రి వరకు ఆందోళనకు దిగింది. నా భర్తకు ఎలాంటి అనారోగ్యం లేదు.. కూలీ పనులు చేసుకునే.. నా భర్త మరణానికి వైన్ షాప్ యాజమాన్యమే బాధ్యత వహించాలి అని Ntvతో మృతుడి భార్య మైబా పేర్కొన్నారు. నాగి చనిపోయాడు అని తెలిస్తే.. మాకు ఎందుకు చెప్పలేదు అని ఆమె ప్రశ్నించింది.
Read Also: Viral News: మోడ్రన్ బిచ్చగాడు..చేతిలో క్యూఆర్ కోడ్‌తో భిక్షాటన..
శవాన్ని ఈడ్చుకు వచ్చి.. రోడ్డు పై పడేశారు.. వైన్స్ లోపల నా భర్తపై దాడి జరుగొచ్చు.. సీసీ కెమెరాల దృశ్యాలు చూపెట్టాలి అని నాగి భార్య మైబా డిమాండ్ చేసింది. మృతుడి కుటుంబానికి న్యాయం చేసే వరకు పోరాడుతామంటు స్థానికులు పేర్కొన్నారు. నకిలీ మద్యంతోనే ప్రాణం పోవచ్చు అని స్థానికులు అనుమానిస్తున్నారు. తన భర్త చావుకి కారణమైన వైన్ షాప్ లోకి దూరి మద్యం బాటిళ్లను మైబా ధ్వంసం చేసింది. దీంతో ఆమెను వైన్ షాప్ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
