NTV Telugu Site icon

Nuh Voilence: నుహ్ హింసకు పాల్పడిన నిందితుడు అరెస్ట్

Nuh

Nuh

నుహ్, గురుగ్రామ్ ప్రాంతాలలో గత నెలలో జరిగిన మత హింసకు సంబంధించి హర్యానాకు చెందిన బజరంగ్ దళ్ సభ్యుడు బిట్టు బజరంగిని పోలీసులు అరెస్టు చేశారు. అతను సహచర భజరంగ్ దళ్ కార్యకర్తలకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెప్పి హింసను ప్రేరేపించేలా చేశాడని ఆరోపణలు ఉన్నాయి. బిట్టు బజరంగీ అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. నుహ్ లో హింస చెలరేగిన దాదాపు 20 రోజుల తర్వాత అతని ఇంటి దగ్గర పట్టుబడ్డాడు. నుహ్ లో జరిగిన మత ఘర్షణలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. కనీసం 70 మంది గాయపడ్డారు. మరోవైపు నుహ్ లో ప్రారంభమైన హింసాకాండ గురుగ్రామ్ నుండి 40 కి.మీ దూరంలోని బాద్షాపూర్ వరకు వ్యాపించింది.

Read Also: Rishabh Pant: టీమిండియాలోకి రిషబ్ పంత్ రీఎంట్రీ..?

బిట్టు బజరంగీ అలియాస్ రాజ్ కుమార్.. ఫరీదాబాద్‌లోని గాజీపూర్ మార్కెట్ లో పండ్లు మరియు కూరగాయల వ్యాపారం నిర్వహిస్తుంటాడు. అంతేకాకుండా.. భజరంగ్ దళ్ సభ్యుడు.. గత మూడేళ్లుగా గోసంరక్షక బృందాన్ని నడుపుతున్నాడు. గత ఒక్క నెలలోనే మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టే విధంగా ఆయనపై మూడు కేసులు నమోదయ్యాయి. మరోవైపు నుహ్ హింసాకాండ తర్వాత ఫరీదాబాద్‌లో గోరక్ష బజరంగ్ ఫోర్స్ చీఫ్‌పై కేసు నమోదైంది.

Read Also: SBI : ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్..

హర్యానాలోని ఫరీదాబాద్‌లో బిట్టు బజరంగిని పోలీసులు చాలా సేపు వెంబడించి పట్టుకున్నారు. అల్లర్లు, హింస, బెదిరింపులు, ప్రభుత్వ పనులను అడ్డుకోవడం, ప్రభుత్వ అధికారిని విధుల నుంచి తప్పించడం, మారణాయుధంతో హాని కలిగించడం వంటి అభియోగాలు అతనిపై ఉన్నాయి. మరోవైపు నుహ్‌లో జరిగిన హింసాకాండకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో బిట్టు బజరంగీ రెచ్చగొట్టేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎట్టకేలకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అతనిపై ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో చూడాలి.